పెళ్లి ప్లాన్స్ బయటపెట్టిన తాప్సీ
తెలుగులో తెరకెక్కిన ‘ఝుమ్మందినాదం’తో కథానాయికగా వెండితెరకు పరిచయమైన తాప్సీ ప్రస్తుతం వరుస అవకాశాలతో బాలీవుడ్లో రాణిస్తున్నారు. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రియుడు మథియాస్ బో, పెళ్లి ప్లాన్స్...
బాయ్‌ఫ్రెండ్ గురించి పెదవి విప్పిన ముద్దుగుమ్మ
ముంబయి: తాప్సీ ప్రస్తుతం వరుస అవకాశాలతో బాలీవుడ్లో రాణిస్తున్నారు. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ప్రియుడు మథియాస్ బో గురించి, పెళ్లి ప్రణాళికల గురించి స్పందించారు. ‘రష్మీ రాకెట్’ చిత్రీకరణలో పాల్గొంటున్న తాప్సీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘నా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను ఎప్పుడూ వేర్వేరుగానే చూస్తాను. అందుకే ఇండస్ట్రీకి చెందిన వ్యక్తితో డేటింగ్ చేయాలని భావించలేదు. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వారి పుట్టినరోజులను పురస్కరించుకుని సోషల్‌మీడియా వేదికగా ఫొటోలు షేర్ చేస్తాను. మథియాస్ బో బర్త్‌డేకు కూడా అదే చేస్తాను’
‘కెరీర్‌పరంగా ఇంకా ఎన్నో సాధించాలనే ఆలోచన నాలో ఉంది. ఆశించిన స్థాయికి చేరుకున్నాక పెళ్లి గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తున్నాను. పెళ్లి, వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించాలని భావించినప్పుడు ప్రాజెక్ట్‌ల ఎంపికలో కాస్త నిదానంగా ఉంటాను’ అని తాప్సీ వివరించారు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్