Taapsee: కలేమోననిన్న చెక్ చేసుకుంటూ ఉంటా!
‘‘ఆ చిత్రంలో అవకాశం కోసం నేను ఎవరితోనే ఫోన్ చేయించలేదు. అది నా ప్రతిభ ఆధారంగానే దక్కింది’’ అంటోంది కథానాయిక తాప్సి. అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలతోనూ మెప్పిస్తున్న ఈ అమ్మడు ఇటీవలే షారుక్-రాజ్‌కుమార్ హిరాణి కలయికలో రూ
‘‘ఆ చిత్రంలో అవకాశం కోసం నేను ఎవరితోనే ఫోన్ చేయించలేదు. అది నా ప్రతిభ ఆధారంగానే దక్కింది’’ అంటోంది కథానాయిక తాప్సి(Taapsee). అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలతోనూ మెప్పిస్తున్న ఈ అమ్మడు ఇటీవలే షారుక్(Sharukh Khan)-రాజ్‌కుమార్ హిరాణి(Rajkumar Hirani) కలయికలో రూపొందుతున్న ‘డంకి’(Dunki) చిత్రంలో నాయిక అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తైంది. ఈ సందర్భంగా తాప్సి విలేకరులతో మాట్లాడుతూ..‘‘కింగ్ ఖాన్ షారుక్ సరసన నటించాలని తపించని నటులుండరు. అలాంటి అరుదైన అవకాశం నాకు దక్కింది. దీని కోసం నేను ఎవరి సిఫార్సులు అడగలేదు. నా గత చిత్రాల నటన నచ్చే దర్శకుడు హిరాణి ఎంపిక చేసుకున్నారు. ఒకవైపు షారుక్ లాంటి అగ్రనటుడు, మరోవైపు దేశగర్వించే దర్శకుడు హిరాణి... ఇలా ఇద్దరితో కలసి పనిచేసే అవకాశం రావడం పెద్ద వరం. ఇప్పటికీ దీన్ని నమ్మలేక.. గిల్లి మరీ చెక్ చేసుకుంటూ ఉంటాను. ఇది కలా? నిజమా? అని. ఇదంతా మరిచిపోలేని ఓ అనుభూతి’’ అంటూ చెప్పుకొచ్చింది. తాప్సి ప్రస్తుతం ‘శభాష్ మిథు’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ‘డంకి’ రెండు షెడ్యూల్లో ఈ ముద్దుగుమ్మ పాల్గొననుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
UPSC Civils 2024: ‘సివిల్స్’ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా.. కొత్త డేట్ ఇదే..
-
Pawan Kalyan: కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన
-
Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్‌కు ఇక ప్రత్యేకంగా
-
Paris Olympics: ఒలింపిక్ విలేజ్‌లో 3లక్షల కండోమ్‌లు..!
-
Janasena: పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైంది: పవన్ కల్యాణ్
-
Social Look: కృతి సనన్ ‘క్రూ’ సంగతులు.. వేడుకలో మృణాల్, కియారా మెరుపులు