
Updated : 09 Jan 2022 06:53 IST
Taapsee: ప్రియుణ్ని రక్షించడమే లక్ష్యం
తాప్సి కెరీర్ జోరుగా సాగుతోంది. గత ఏడాది ఆమె నుంచి మూడు చిత్రాలు వచ్చాయి. తాజాగా ఆమె నటించిన మరో చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. తాప్సి, తహిర్ రాజ్ జంటగా నటించిన ‘లూప్ లపేటా’ వచ్చే నెల 4న నెట్ఫ్లిక్స్లో విడుదల కానుంది. ఈ చిత్ర దర్శకుడు ఆకాష్ భాటియా మాట్లాడుతూ ‘‘రొమాన్స్, థ్రిల్లర్ అంశాలే కాక చక్కటి కామెడీ ఈ చిత్రంలో ఉంటుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమిది’’అన్నారు. ‘‘ప్రేక్షకుల్ని ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే ఈ చిత్రం విడుదల గురించి ఎంతో ఆసక్తిగా చూస్తున్నాను. నేను ఎంతో ఆస్వాదిస్తూ నటించిన కథ ఇది. మీరూ ఎంజాయ్ చేస్తారు’’అని చెప్పింది తాప్సి. తన ప్రియుణ్ని రక్షించే కోవడమే లక్ష్యంగా ఓ ప్రేయసి సాగించిన ప్రయాణమే ఈ కథ.
Tags :