Tabu: లేడీ బాస్‌ టబు

‘దృశ్యం 2’తో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు అజయ్‌దేవ్‌గణ్‌, టబు. ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న మరో చిత్రం ‘భోలా’. విజయం సాధించిన కార్తి ‘ఖైదీ’ చిత్రానికి హిందీ రీమేక్‌ ఇది.

Updated : 18 Jan 2023 07:22 IST

‘దృశ్యం 2’తో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు అజయ్‌దేవ్‌గణ్‌ (Ajay Devgn), టబు (Tabu). ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న మరో చిత్రం ‘భోలా’ (Bholaa). విజయం సాధించిన కార్తి ‘ఖైదీ’ చిత్రానికి హిందీ రీమేక్‌ ఇది. ఈ చిత్రంలో టబు పోలీస్‌ అధికారిగా నటించారు. ఇందులో ఆమె పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. తాజాగా ఈ చిత్రంలో టబుకు సంబంధించిన లుక్‌ను అజయ్‌దేవ్‌గణ్‌ పంచుకున్నారు. ‘ఏక్‌ ఖాకీ..సౌ సైతాన్‌’ అని వ్యాఖ్యను పోస్ట్‌ చేశారు. లేడీ బాస్‌ వచ్చిందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. అజయ్‌దేవ్‌గణ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. అమలా పాల్‌, సంజయ్‌ మిశ్రా తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని త్రీడీలో మార్చి 30న విడుదల చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని