Tabu: ఈ మూడే నాకు ముఖ్యం

త్వరలో ‘ఔరో మే కహా దమ్‌ థా’తో వారి ప్రేమకథను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ముస్తాబవుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్, టబు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నీరజ్‌ పాండే తెరకెక్కిస్తున్నారు.

Published : 09 Jul 2024 01:14 IST

త్వరలో ‘ఔరో మే కహా దమ్‌ థా’తో వారి ప్రేమకథను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ముస్తాబవుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్, టబు. వీరిద్దరూ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నీరజ్‌ పాండే తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 2న దీన్ని విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న టబు.. సినిమాలు ఎంచుకునే విధానం గురించి కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ‘‘ఒక ప్రాజెక్టుకు సంతకం చేస్తున్నప్పుడు.. నేను అనుకున్న ఈ మూడు అంశాలు అందులో ఉన్నాయో లేదో చూసుకుంటాను.  మొదటిది కథ.. ఇది నాకు చాలా ముఖ్యమైనది. కొత్తదనంతో నిండిన కథలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతాను. రెండోది ఆ కథాంశంపై నా పాత్ర ప్రభావం ఎలా ఉంటుంది. ఈ కథను తనదైన శైలిలో ప్రేక్షకులకు పరిచయం చేసే దర్శకుడు ఎవరనేది మూడో అంశం. ఈ విషయాల్ని మాత్రమే నేను పరిగణనలోకి తీసుకుంటాను. ఇవి కాకుండా సినిమాలో ఇంకా ఎవరు నటిస్తున్నారనేది నాకు అవసరం లేద’’ని చెప్పుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు