తమన్నా సువిశాలమైన ఇంటిని చూశారా

వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే మిల్కీబ్యూటీ తమన్నా తాజాగా తన హోమ్‌ టూర్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఓ ప్రముఖ పెయింటిగ్స్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముంబయిలోని తన సువిశాలమైన నివాసాన్ని తమన్నా...

Updated : 07 Dec 2022 19:31 IST

వైరల్‌గా మారిన మిల్కీబ్యూటీ హోమ్‌టూర్‌ వీడియో

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస సినిమాల‌తో బిజీగా ఉండే మిల్కీబ్యూటీ తమన్నా తాజాగా తన హోమ్‌ టూర్‌తో నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఓ ప్రముఖ పెయింటింగ్స్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముంబయిలోని తన సువిశాలమైన నివాసాన్ని తమన్నా అందరికీ పరిచయం చేశారు. షూటింగ్స్‌ కారణంగా తాను ఇంట్లో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం లేదని ఆమె అన్నారు. ఎప్పుడైనా ఇంట్లో ఉంటే తన తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడుతూ.. టీ సేవించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తానని ఆమె తెలిపారు. హోమ్‌ టూర్‌లో భాగంగా తనకెంతో ఇష్టమైన పెంపుడు శునకాన్ని తమన్నా పరిచయం చేశారు.

‘‘సుమారు ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. ఇంటీరియర్‌ డిజైన్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని నాన్నే దగ్గరుండి చూసుకున్నారు. సినిమా షూటింగ్స్‌, ఇతర పనుల రీత్యా నేను ఇంట్లో చాలా తక్కువ సమయాన్ని గడుపుతుంటాను. అయితే ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ నివాసం నాకు ప్రతిరోజూ కొత్తగానే ఉంటుంది’’ అని తమన్నా వివరించారు. ఇక, సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తమన్నా ‘ఎఫ్‌-3’, ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని