ఆ మాటలు వినిపిస్తున్నాయి

సమాజం ఎంతో ముందుకు వెళుతున్నా.. ఆడవాళ్లు ఇంకా అది చేయలేరు. ఇది చేయడానికి వాళ్లు పనికిరారు అనే మాటలు వినిపిస్తున్నాయి.’’ అంటోంది అందాల నటి తమన్నా....

Published : 12 Apr 2021 10:53 IST

హైదరాబాద్‌: ‘‘సమాజం ఎంతో ముందుకు వెళుతున్నా.. ఆడవాళ్లు ఇంకా అది చేయలేరు. ఇది చేయడానికి వాళ్లు పనికిరారు అనే మాటలు వినిపిస్తున్నాయి.’’ అంటోంది అందాల నటి తమన్నా. ‘ఎఫ్‌2’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘అంధాదున్‌’ తెలుగు రీమేక్‌లో నితిన్‌తో కలిసి నటిస్తున్న ఈ భామ.. ఇటీవలే ఓ వెబ్‌సిరీస్‌ పూర్తి చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘‘నేను ఏ పాత్రైనా శక్తివంచన లేకుండా నటిస్తా. 100శాతం సామర్థ్యంతోనే పనిచేస్తా. ఇలా వివిధ రంగాల్లోని మహిళలు తమ బాధ్యతల్లో వందశాతం శక్తి  సామర్థ్యాలను ఉపయోగిస్తారు. అయినా ఇంకా వారి మీద సమాజంలో పూర్తిస్థాయి నమ్మకం కలగడం లేదు. ఇది తొలగిపోయినప్పుడు... మహిళలకు మరిన్ని అవకాశాలు వస్తాయి. వారు మరింతగా ఎదుగుతారు’’ అని చెప్పుకొచ్చింది. ‘‘థియేటర్లో సినిమా చూడటం అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. అలాగే ఓటీటీకి ఉండే అవకాశాలు ఓటీటీకి ఉన్నాయి. ఇక్కడ కథను ఎంత వివరంగానైనా చెప్పవచ్చు. నటనలో భిన్నత్వం ప్రదర్శించే వీలు కలుగుతుంది. దర్శకులకు స్వేచ్ఛ లభిస్తుంది.’’ అని చెప్పుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని