Tamannaah: క‌థ బాగుంటేనే సినిమా చూస్తున్నారు

కాలంతోపాటు ప్రేక్షుకుల అభిరుచులూ మారుతున్నాయి. ఒకప్పుడు స్టార్ న‌టులున్న సినిమాల‌నే ఎక్కువగా ఆద‌రించేవారు. ప్ర‌స్తుతం క‌థ బాగుంటేనే చూస్తున్నారు అని ప్ర‌ముఖ నాయిక త‌మ‌న్నా భాటియా అన్నారు.

Published : 27 May 2021 23:34 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: కాలంతోపాటు ప్రేక్షుకుల అభిరుచులూ మారుతున్నాయి. ఒకప్పుడు స్టార్ న‌టులున్న సినిమాల‌నే ఎక్కువగా ఆద‌రించేవారు. ప్ర‌స్తుతం క‌థ బాగుంటేనే చూస్తున్నారు అని ప్ర‌ముఖ నాయిక త‌మ‌న్నా భాటియా తెలిపారు. ఇటీవ‌ల ఆమె డిజిట‌ల్ మాధ్య‌మంలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. తమ‌న్నా న‌టించిన లెవ‌న్త్ అవ‌ర్‌, న‌వంబ‌ర్ స్టోరీ ఓటీటీల్లో సంద‌డి చేస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా త‌న మ‌న‌సులో మాట పంచుకుంది. ‘డిజిట‌ల్ మాధ్య‌మం (ఓటీటీ) వినియోగం పెరిగాక స్టార్ క‌ల్చ‌ర్ అనే విధానంలో మార్పు వ‌చ్చింది. ప్రేక్ష‌కులు ఒకప్ప‌టిలా అగ్ర తార‌లుంటేనే సినిమా చూస్తాం అనే భావ‌న‌తో లేరు.  కంటెంట్ (క‌థ‌) బ‌లంగా ఉంటేనే చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఒక‌దాన్ని ఎంపిక చేసుకోవ‌డం చాలా క‌ష్టం. ఒక‌దానితో ఒక‌టి పోల్చ‌లేం. కొవిడ్ సంక్షోభం వ‌ల్ల థియేట‌ర్లు మూత‌ప‌డ‌టంతో ప్రేక్ష‌కుల‌కి ఓటీటీ బాగా చేరువైంది. నేను 10 ఏళ్ల క్రిత‌మే స్టార్‌డ‌మ్‌ని చూశాను. ఎంతోమంది అభిమానాన్ని పొంద‌డం అదృష్టంగా భావిస్తున్నాను’ అని వెల్లడించింది. ప్ర‌స్తుతం స‌త్య‌దేవ్ స‌ర‌స‌న ‘గుర్తుందా శీతాకాలం’, వెంక‌టేశ్ స‌ర‌స‌న ‘ఎఫ్ 3’, గోపీచంద్ స‌ర‌స‌న ‘సీటీమార్’ చిత్రంలో న‌టిస్తుంది త‌మ‌న్నా.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు