Tamannaah Bhatia: తమన్నా కొత్త వెబ్‌సిరీస్‌.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌.. ఎక్కడంటే?

‘11th అవర్‌’, ‘నవంబర్‌ స్టోరీ’ తదితర వెబ్‌సిరీస్‌లతో అలరించిన ప్రముఖ హీరోయిన్‌ తమన్నా.. మరో సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఆ వివరాలపై ఓ లుక్కేయండి..

Published : 02 Jun 2023 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరోయిన్‌ తమన్నా (Tamannaah Bhatia) నటించిన తాజా వెబ్‌సిరీస్‌.. ‘జీ కర్దా’ (Jee Karda). ఈ సిరీస్‌ విడుదల తేదీ శుక్రవారం ఖరారైంది. జూన్‌ 15 నుంచి ఓటీటీ (ott) ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (amazon prime video)లో సిరీస్‌ స్ట్రీమింగ్ కానున్నట్టు.. టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు వీడియో విడుదల చేసింది. స్నేహం ప్రధానంగా ఈ సిరీస్‌ తెరకెక్కింది. బాల్యం నుంచి జీవితంలో స్థిరపడే వరకు ఏడుగురి మిత్రుల ప్రయాణం చుట్టూ అల్లుకున్న కథ ఇది. అరుణిమ శర్మ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ఆషిమ్‌, సుహైల్‌ నాయర్‌, అన్యా సింగ్‌, హుస్సేన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇప్పటికే ‘11th అవర్‌’, ‘నవంబర్‌ స్టోరీ’వంటి వెబ్‌సిరీస్‌లతో ప్రేక్షకుల్ని అలరించిన తమన్నా ప్రస్తుతం.. టైటిల్‌ ఖరారుకాని ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. మరోవైపు, ‘అరణ్మయై4’, ‘బోలే చుడియన్‌’, ‘భంద్రా’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘భోళా శంకర్‌’ (Bhola Shankar)లో చిరంజీవి సరసన సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్‌ అవుతుంది. రజనీకాంత్‌ సరసన ఆమె నటించిన ‘జైలర్‌’ (Jailer) సినిమా షూటింగ్‌ గురువారంతో ముగిసింది. ఈ సినిమా ఆగస్టు 10న విడుదల కానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని