Published : 06 May 2021 19:53 IST

tamannaah: ‘నవంబర్‌ స్టోరీ’ వచ్చేస్తోంది

ఇంటర్నెట్‌ డెస్క్: మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ తన హవాను కొనసాగిస్తోంది. బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు వెబ్‌సిరీస్‌ చిత్రాల్లోనూ నటిస్తోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాగా తెలుగులో వచ్చిన ‘11th అవర్‌’లో వాపారవేత్త ఆరాత్రికారెడ్డిగా నటించి మెప్పించింది. తన రెండో వెబ్ చిత్రంగా తమిళంలో ‘నవంబర్‌ స్టోరీ’లో నటిస్తోంది. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమమైన ఈ సినిమాకి ఇంద్ర సుబ్రమణియన్‌ దర్శకత్వం వహించారు. తాజాగా సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. మే 20న  డిస్నీ + హాట్‌స్టార్ వీఐపీలో తమిళ, తెలుగు, హిందీలో స్ట్రీమింగ్‌ అవుతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.

జీఎం కుమార్‌ కీలక పాత్రలో నటించగా పసుపతి, వివేక్ ప్రసన్న, అరుళ్‌ దాస్‌, నందిని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ప్రముఖ క్రైమ్ నవలా రచయిత గణేశన్‌ (జీఎం కుమార్‌) అల్జీమర్స్ (మతిమరుపు వ్యాధి)తో బాధపడుతుంటాడు. ఆయనకు ఒక కూతురు, పేరు అనురాధ (తమన్నా) ఎథికల్‌ హ్యాకర్‌గా పనిచేస్తుంటుంది. తండ్రీకూతుళ్లు ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. అయితే నవంబర్‌ 16న ఓ పాడుబడిన ఇంట్లో పెయింటింగ్‌తో కప్పి ఉంచిన ఒక మహిళ మృతదేహం బయటపడుతుంది. వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు అనురాధ తండ్రి గణేశన్ అనుమానిస్తారు. అక్కడి పరిస్థితి, సాక్ష్యాలు కూడా గణేశ్‌ నేరస్థుడు అనే విధంగా ఉంటాయి. అప్పుడు అనురాధ తన తండ్రి నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు ప్రయత్నం చేస్తుంది. మరీ ఆ హత్య ఎవరు చేశారో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. తమన్నా ఇందులో తెలివైన స్వతంత్ర్య భావాలు కలిగిన యువతిగా కనిపించనుంది. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts