Tamannaah: నేను ఉత్సాహంగా ఉండడానికి కారణం వాళ్ల ప్రేమే..: తమన్నా

అందాల తారా తమన్నా సెట్‌లోని వారితో కలిసి దీపావళి జరుపుకోనున్నట్లు తెలిపింది. ప్రేక్షకులు, ఆమె అభిమానులు తన పై చూపించే ప్రేమే ఆమెను ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చూస్తుందని చూపింది.

Published : 24 Oct 2022 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా. ప్రస్తుతం ఈ అమ్మడు మలయాళ సినీ పరిశ్రమలోకి తెరంగేట్రం చేయనుంది. ఈ అందాలతార సెట్‌లోని వారితో కలిసి దీపావళి జరుపుకోనున్నట్లు తెలిపింది.  ‘‘నేను దీపావళి రోజు కూడా పనిచేస్తున్నందుకు అంత సంతోషంగా లేను. కానీ, ఇక్కడ ఉన్న నటీనటులు, సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకొంటున్నా. దాని కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఇప్పటి వరకు ఇంత మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకులు, నా అభిమానులు నా పై చూపించే ప్రేమే నన్ను ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చూస్తుంది’’ అని చెప్పింది.  ఇక ప్రస్తుతం తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’లో నటిస్తోంది. కన్నడలో విజయవంతమైన ‘లవ్‌ మాక్‌ టెయిల్‌’కి రీమేక్‌గా రూపొందించిన చిత్రమిది. సత్యదేవ్‌ హీరోగా నాగశేఖర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మేఘ ఆకాష్‌, కావ్యశెట్టి ముఖ్యపాత్రలు పోషించారు. దీనితో పాటు మెగాస్టార్‌ సరసన ‘భోళా శంకర్‌’లో అలరించనుంది. అన్నా-చెల్లెళ్ల సెంటిమెంట్‌గా రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకులను పలకరించనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని