సినీ పరిశ్రమలో నిలబెట్టేది అదొక్కటే!

స్టార్‌ కథానాయికగా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న తార తమన్నా. కెరీర్‌ ప్రారంభంలో అపజయాలనే చవిచూసినా

Updated : 03 Jan 2021 15:09 IST

హైదరాబాద్‌: స్టార్‌ కథానాయికగా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న తార తమన్నా. కెరీర్‌ ప్రారంభంలో అపజయాలనే చవిచూసినా ఆ తర్వాత అగ్ర కథానాయకులందరితోనూ ఆమె ఆడి పాడారు. అయితే, టాలీవుడ్‌ వ్యక్తులే సినీపరిశ్రమలో పైచేయి సాధిస్తారనే మాట చాలా ఏళ్లుగా చర్చకొస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మిల్కీ బ్యూటీ స్పందించింది.

‘‘ఇండస్ట్రీకి చెందినవారా? కాదా అనేది సమస్య కాదు. ప్రతిభ ఉండి నిబద్దతతో పనిచేసే ఎవరైనా ఇక్కడ విజయాలు సాధించొచ్చు. వాస్తవానికి  బయటివారికి ఇది మంచి సమయం. ప్రతిభ ఆధారంగానే ఇప్పుడు అవకాశాలు దక్కుతున్నాయి. పరిశ్రమలో ఇప్పుడున్న సూపర్‌ స్టార్లు చాలా వరకు బయటి వ్యక్తులే. నాకు గాడ్‌ఫాదర్‌ ఎవరూ లేరు. నేను ఇండస్ట్రీకి చెందినదాన్నీ కాదు. సొంత ప్రతిభతో ఎదిగాను. కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది’’ అని ఆమె చెప్పింది.

తమన్నా తెలుగులో సత్యదేవ్‌తో ‘గుర్తుందా సీతాకాలం’, గోపీచంద్‌తో ‘సీటీమార్‌’, ‘ఎఫ్‌3’ సినిమాల్లో నటిస్తోంది. అంధాధున్‌ తెలుగు రీమేక్‌లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ‘ఎలెవెన్త్‌ అవర్‌’తో ఓటీటీల్లోనూ అరంగేట్రం చేస్తోంది.

ఇవీ చదవండి..

యుగానికొక్కడు సీక్వెల్‌లో ఆ హీరో ఫిక్స్‌

నితిన్‌ ‘చెక్‌’ ఫస్ట్‌ గ్లింప్స్‌ చూశారా?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని