వేడుకగా యువ నటుడి వివాహం.. ఫొటోలు షేర్‌ చేసిన బిందు మాధవి

కోలీవుడ్‌ యువ నటుడు హరీశ్‌ కల్యాణ్‌ ఓ ఇంటివాడు అయ్యాడు. నర్మదా ఉదయ్‌కుమార్‌తో ఆయన ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టాడు.

Updated : 28 Oct 2022 13:25 IST

చెన్నై: కోలీవుడ్‌ యువ నటుడు హరీశ్‌ కల్యాణ్‌ (Harish Kalyan ) వివాహబంధంలోకి అడుగుపెట్టాడు. నర్మదా ఉదయ్‌కుమార్‌ మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరి వివాహం శుక్రవారం తెల్లవారుజామున చెన్నైలో వేడుకగా జరిగింది. హరీశ్‌ స్నేహితురాలు, నటి బిందుమాధవి ఈ వివాహ వేడుకలో పాల్గొని సందడి చేసింది. నూతన జంట ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేసి ఆమె అభినందనలు తెలిపింది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. హరీశ్‌ దంపతులకు కంగ్రాట్స్‌ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

‘జెర్సీ’ సినిమాతో హరీశ్‌ కల్యాణ్ తెలుగువారికీ చేరువయ్యాడు. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని కుమారుడు పాత్రలో క్లైమాక్స్‌ సన్నివేశాల్లో తళుక్కున మెరిశాడు. యాక్షన్‌, యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలతో కోలీవుడ్‌ ప్రేక్షకుల్ని అలరించిన ఈ నటుడు.. ‘ప్యార్‌ ప్రేమ కాదల్‌’, ‘ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం’లతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కాదలి’ అనే టాలీవుడ్‌ చిత్రంలోనూ  హీరోగా నటించాడు. ఇక, ధోనీ ప్రారంభించిన నిర్మాణసంస్థలో హరీశ్‌ త్వరలో సినిమా చేయనున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం సాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు