Megha Akash: పెళ్లి పీటలెక్కనున్న మేఘా ఆకాశ్‌.. పొలిటీషియన్‌ తనయుడితో డేటింగ్‌?

నటి మేఘా ఆకాశ్‌ (Megha Akash) త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం.

Published : 08 Jun 2023 13:42 IST

చెన్నై: తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన చెన్నై చిన్నది మేఘా ఆకాశ్‌ (Megha Akash) త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడితో ఆమె కొంతకాలం నుంచి ప్రేమలో ఉందని సమాచారం. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల సభ్యులు తాజాగా పెళ్లికి అంగీకారం తెలిపారని భోగట్టా. ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ వివాహం చేసుకోనున్నారని కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే నిశ్చితార్థం చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై మేఘ నుంచి కానీ, ఆమె టీమ్‌ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 

మేఘా ఆకాశ్‌ నటనపై ఉన్న ఆసక్తితో వెండితెర వైపు అడుగులు వేశారు. ‘లై’తో ఆమె నటిగా పరిచయమయ్యారు. ‘ఛల్‌ మోహన్‌రంగా’, ‘రాజ రాజ చోర’, ‘డియర్‌ మేఘ’, ‘గుర్తుందా శీతాకాలం’, ‘ప్రేమదేశం’, ‘రావణాసుర’ చిత్రాల్లో ఆమె నటించారు. ఆమె కీలకపాత్రలో నటించిన ‘బూ’ సినిమా ఇటీవల జియో సినిమాలో విడుదలైంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు