Gopichand: మరో కథ సిద్ధం

‘పక్కా కమర్షియల్‌’ సినిమాని పూర్తి చేసిన కథానాయకుడు గోపీచంద్‌... ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా గడుపుతున్నారు. ఆ తర్వాత చేయనున్న సినిమా కోసమూ కథ

Published : 06 Apr 2022 14:57 IST

‘పక్కా కమర్షియల్‌’ సినిమాని పూర్తి చేసిన కథానాయకుడు గోపీచంద్‌... ప్రస్తుతం శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో బిజీగా గడుపుతున్నారు. ఆ తర్వాత చేయనున్న సినిమా కోసమూ కథ సిద్ధమైనట్టు తెలుస్తోంది. తమిళ దర్శకుడు హరి... గోపీచంద్‌ కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు సమాచారం. దాని గురించి ఇద్దరి మధ్య కథా చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అన్నీ కుదిరితే ఈ కలయికలో సినిమా ఖాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళంతోపాటు, తెలుగులోనూ విజయవంతమైన ‘సింగం’ సినిమాల్ని తెరకెక్కించిన దర్శకుడే హరి. గోపీచంద్‌ యాక్షన్‌ చిత్రాలకి తగ్గ కథానాయకుడే. కథపై ఇద్దరి అభిప్రాయాలు కుదిరితే ఈ కలయికలో సినిమా పక్కా అయినట్టే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని