TamilCinema: కోలీవుడ్‌ కబుర్లు

సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి అప్‌డేట్‌ ఇస్తున్నాయి ఆయా చిత్రాల బృందాలు. మరి కోలీవుడ్‌కి సంబంధించి నేటి విశేషాలేంటో చూద్దామా..

Published : 28 Jun 2021 16:53 IST

చెన్నై: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కాస్త తగ్గుముఖం పట్టడంతో అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ సందడి మొదలైంది. ఓ వైపు చిత్రీకరణలు, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్‌ కార్యక్రమాలతో మునపటి కోలాహలం కనిపిస్తోంది. ఆ విశేషాల్ని సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పటికప్పుడు ప్రేక్షకులకి అందిస్తున్నాయి ఆయా చిత్రాల బృందాలు. మరి కోలీవుడ్‌ తాజా అప్‌డేట్స్‌ చూద్దామా..

ఇంకా 15 రోజులు..

విజయ్‌ సేతుపతి హీరోగా విఘ్నేశ్‌ శివన్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్‌’. నయనతార, సమంత నాయికలు. ఈ సినిమాకి సంబంధించి ఇంకా 15 రోజుల షూటింగ్‌ మిగిలి ఉందని తెలియజేసింది చిత్ర బృందం. ప్రేమకథా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.

ఎ.ఎస్‌ 14..

అశోక్‌ సెల్వన్‌ కథానాయకుడిగా వయాకామ్‌ 18 స్టూడియోస్‌, రైజ్‌ ఈస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని ప్రకటించాయి. ఆర్‌. కార్తీక్‌ దర్శకుడు. రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్‌ నాయికలు. ‘ఎ.ఎస్‌ 14’ వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానుంది.

‘టెడ్డీ’ కాంబినేషన్‌లో మరొకటి..

కథానాయకుడు ఆర్య- దర్శకుడు శక్తి సౌందర్‌ రాజన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘టెడ్డీ’ చిత్రం మంచి విజయం అందుకుంది. ఇదే ఉత్సాహంతో మరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అందరూ ఊహిస్తున్నట్టు ఇది ‘టెడ్డీ’కి సీక్వెల్‌ కాదని తెలిపారు. కొత్త స్క్రిప్టుతో, యాక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని