
తమిళనాడు థియేటర్లలో 100శాతం సీట్ల భర్తీకి ఓకే
చెన్నై: తమిళనాడులోని సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సీట్ల సామర్థ్యాన్ని 100శాతానికి పెంచేందుకు ప్రభుత్వం సోమవారం అనుమతిచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన వెలువరించింది. ‘‘కొవిడ్-19 నిబంధనలు అనుసరిస్తూ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో సీట్ల సామర్థ్యాన్ని 100శాతానికి పెంచేందుకు ప్రభుత్వం అనుమతిస్తోంది. అంతే కాకుండా ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెంచేందుకు సినిమాకు ముందు సంబంధిత ప్రకటనలు ప్రదర్శిస్తారు.’’ అని ఆ ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో థియేటర్ల సామర్థ్యాన్ని వందశాతానికి పెంచాలని కోరుతూ ఇటీవల కోలీవుడ్ నటులు, థియేటర్ల యాజమాన్యాలు ముఖ్యమంత్రి ఈ. పళనిస్వామిని కోరారు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన వెలువరించింది. కరోనా కారణంగా థియేటర్లు గత మార్చి నెల నుంచి తెరచుకోవడం లేదు. కరోనా రక్షణ చర్యల్లో భాగంగా భౌతికదూరాన్ని పాటిస్తూ కేవలం 50శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం గతేడాది అక్టోబర్ నుంచి అనుమతిచ్చింది.
ఇవీ చదవండి..
సామ్.. నేను సలహా ఇస్తే నువ్వు తీసుకుంటావా!