Tamil Rockerz: ‘సినీ పైరసీ భూతం’ హెడ్‌ అతడే.. ‘తమిళ్‌ రాకర్స్‌’ ట్రైలర్‌ చూశారా!

తమిళ్‌ రాకర్స్‌ ట్రైలర్‌. అరుణ్‌ విజయ్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌ త్వరలోనే స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 11 Aug 2022 20:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ పైరసీ భూతం తమిళ్‌ రాకర్స్‌ (Tamil Rockerz) నేపథ్యంలో అదే పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. అరుణ్‌ విజయ్‌ (Arun Vijay) ప్రధాన పాత్ర పోషించారు. దర్శకుడు అరవగళన్‌ రూపొందిన ఈ సిరీస్‌ ఓటీటీ ‘సోనీ లివ్‌’లో (Sony Liv) ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళ ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా తెలుగు ట్రైలర్‌ను పంచుకుంది. ‘‘గరుడ’ సినిమా థియేటర్లలోకి రావడానికి కంటే ముందే మీ తమిళ్‌ రాకర్స్‌తో హెచ్‌డీ క్వాలిటీతో రిలీజ్‌ అవుతుంది’’ అనే సంభాషణతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. సినిమాలని ఎలా పైరసీ చేస్తారు? ఆ నెట్‌వర్క్‌ ఏంటి? దీని వల్ల తమిళ్‌ రాకర్స్‌కి వచ్చే లాభం ఏంటి? ఈ మొత్తం తమిళ రాకర్స్‌ నెట్‌వర్క్‌ వెనుక ఎవరున్నారు? ఇలాంటి వివరాలన్నింటినీ ఈ సిరీస్‌లో చూపించనట్టు తెలుస్తోంది. ‘తమిళ్‌ రాకర్స్‌కి వాడే హెడ్‌’ అంటూ అరుణ్‌ చెప్పిన డైలాగ్‌ సిరీస్‌పై ఆసక్తి రేకెత్తించేలా ఉంది. మరి, ఆ హెడ్‌ ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సిరీస్‌లో ఐశ్వర్య మేనన్‌, పెరుమాళ్‌, వినోదిని తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని