Tapsee: నా లైంగిక జీవితం అంత ఆసక్తిగా ఉండదు: తాప్సీ పన్ను

బాలీవుడ్‌లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ముందు వరుసలో ఉండే నటి తాప్సీ పన్ను (Taapsee Pannu). తెర బయట సైతం ఈమె ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెబుతుందనే పేరుంది. ప్రస్తుతం ఈమె కథానాయికగా నటించిన...

Updated : 19 Aug 2022 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు ముందు వరుసలో ఉండే నటి తాప్సీ పన్ను (Taapsee Pannu). తెర బయట సైతం ధైర్యంగా తన అభిప్రాయాన్ని చెబుతుందనే పేరుంది. ప్రస్తుతం ఈమె కథానాయికగా నటించిన మిస్టరీ డ్రామా చిత్రం ‘దొబారా’(Dobaaraa). అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) దర్శకత్వం వహించిన ఈరోజు (ఆగస్టు 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ‘దొబారా’ చిత్ర ప్రచారంలో భాగంగా ఆమె మీడియాతో ముచ్చటించారు.

ఈ సమావేశంలో మీడియా ‘మిమ్మల్ని కాఫీ విత్‌ కరణ్‌ (Koffee With Karan)షోకు ఇంకా ఆహ్వానించకపోవడానికి కారణం ఏంటి’ అని ప్రశ్నించింది. దీనికి తాప్సీ ‘నా ‘లైంగిక జీవితం అంత ఆసక్తికరంగా ఉండదు. అందుకే పిలవలేదేమో’ అని నవ్వుతూ సమాధానమిచ్చింది. ఒక్కసారిగా అక్కడున్నవారంతా తాప్సీ సమాధానానికి నవ్వుకున్నారు. ‘కాఫీ విత్‌ కరణ్‌ షో’లో తరచూ లైంగిక విషయాల ప్రస్తావన వస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాప్సీ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది.

ఇక తాప్సీ నటించిన ‘దొబారా’ విషయానికొస్తే ఇది ‘మిరేజ్‌’ అనే స్పానిష్‌ చిత్రానికి రీమేక్‌. టైం ట్రావెల్‌ నేపథ్యంలో వస్తున్న ఈ మిస్టరీ డ్రామా పట్ల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ అన్నారు. ఇక తాప్సీ పన్ను తదుపరి చిత్రం ‘బ్లర్‌’(Blurr) హారర్‌ ఇతివృత్తంగా రానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఇంకా నాలుగైదు సినిమాల షూటింగ్‌లతో ఈమె సినీ జీవితం బిజీగా సాగుతోంది. ఇక వ్యక్తిగతంగా ఈ అమ్మడు ‘మథియాస్‌ బో’(Mathias Boe)అనే డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌తో సహజీవనం చేస్తున్నట్లు చాలాసార్లు చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని