NTR: కలెక్షన్స్‌తో నాకు సంబంధం లేదు.. కానీ: తారక్‌

ఇకపై తన కెరీర్‌ గురించి చెప్పుకునేటప్పుడు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ముందు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత అని అందరూ మాట్లాడుకుంటారని తారక్‌ అన్నారు. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌...

Published : 31 Mar 2022 01:25 IST

ఇకపై నా కెరీర్‌.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు, తర్వాత..

హైదరాబాద్‌: ఇకపై తన కెరీర్‌ గురించి చెప్పుకొంటే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు, తర్వాత అని అందరూ మాట్లాడుకుంటారని తారక్‌ అన్నారు. ప్రస్తుతం ఈ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తోన్న ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్‌లోనే ఈచిత్రం ఎంతో ప్రత్యేకమైనదని అన్నారు.

‘‘ఈ సినిమాలో నా పరిచయ సన్నివేశాలు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయని అందరూ చెబుతున్నారు. నాకిది ఓ ప్రత్యేకమైన చిత్రం. ఇకపై నా కెరీర్‌ గురించి మాట్లాడాలంటే.. అందరూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు, ఆ తర్వాత అని చెప్పుకొంటారు. నటుడిగా ఇప్పటివరకూ చేసిన దానికంటే ఈ సినిమా నా నుంచి ఎంతో శ్రమ కోరుకుంది. నాకొక కొత్త ఆరంభాన్ని అందించింది. ఇందులో పని చేసినందుకు గర్వపడుతున్నాను’’

‘‘సాధారణంగా హీరో ఇంట్రో సీన్‌ వచ్చినప్పుడు ఫ్యాన్స్‌ చప్పట్లు కొడతారు.. ఈలలు వేస్తారు.. కొంతసమయానికి సినిమాలో లీనమైపోతారు. కానీ, ఈ సినిమాలో నా పరిచయ సన్నివేశాలు చూస్తే ‘భీమ్‌’ గురించి ఒక పూర్తి అవగాహన వచ్చేలా దర్శకుడు ఆ షాట్స్‌ తీర్చిదిద్దారు. దర్శకుల పాయింట్ ఆఫ్‌ వ్యూలో ఇదొక గొప్ప పరిచయ సన్నివేశం. అలాగే ఇందులోని చాలా సన్నివేశాలను ప్రేక్షకులు ఫోన్లలలో రికార్డ్‌ చేసి యూట్యూబ్‌లో షేర్‌ చేస్తున్నారు. ప్రేక్షకుల ఎంజాయ్‌మెంట్‌ వీడియోలు చూసి నేనూ ఆనందించా. ఇంతమంది ఆడియన్స్‌ పల్స్‌ని రాజమౌళి ఎలా పట్టుకున్నారు? అని ఆలోచించా’’

‘‘నా దృష్టిలో సినిమాల గురించి మాట్లాడాలంటే మొదట ప్రశంసలు, ఆ తర్వాత రివ్యూలు, చివరిగా నంబర్స్‌(బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌). ఎందుకంటే నంబర్స్‌తో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. అయితే.. నంబర్స్‌ పెరిగితే.. నటీనటులకు మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది’’ అని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని