Jr NTR: తారక్‌కు మైనర్‌ సర్జరీ..  జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుండగా గాయం

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ కుడి చేతి వేలికి సర్జరీ అయ్యింది. ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గాయపడ్డారని.. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా తనయులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌తో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న తారక్‌

Published : 05 Nov 2021 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ కథానాయకుడు ఎన్టీఆర్‌ కుడి చేతి వేలికి చిన్న శస్త్రచికిత్స జరిగింది. ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గాయపడటంతో వైద్యుల సూచన మేరకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దీపావళి సందర్భంగా తనయులు అభయ్‌ రామ్‌, భార్గవ్‌ రామ్‌తో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న తారక్‌.. చేతికి బ్యాండేజీతో కనిపించారు.

ఇటీవల పలువురు సినీ ప్రముఖులు కూడా గాయాల కారణంగా సర్జరీలు చేయించుకున్నారు. చిరంజీవి కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ నొప్పి రావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న నటుడు బాలకృష్ణ  గతనెల 31న బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నారు. అలాగే రజనీకాంత్‌కు కూడా వైద్యులు కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ సర్జరీ చేసి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని