taraka ratna: తాతపై తారకరత్నకు అభిమానం.. ‘NTR’ పేరు కలిసేలా పిల్లలకు పేరు!

సినీ నటుడు తారకరత్న కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Updated : 19 Feb 2023 16:40 IST

హైదరాబాద్‌: సినీ నటుడు తారకరత్న కన్నుమూయడంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్దలంటే గౌరవంతో పాటు, ఇండస్ట్రీలో సౌమ్యుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఇక తాత నందమూరి తారక రామారావు అంటే ఆయనకు ఎంతో అభిమానం. అందుకు గుర్తుగానే తన పిల్లలకు తాత పేరు కలిసేలా పెట్టారు. తారకరత్న అలేఖ్యారెడ్డి ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ముగ్గురు పిల్లలు. మొదట పాప పుట్టగా నిష్క అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఒక పాప, బాబు కవలలు పుట్టారు. వీరికి తనయ్‌ రామ్‌, రేయా అని నామకరణం చేశారు. వీరి పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలు NTR (Nishka, Tanayram, Reya) రావడం గమనార్హం. తాత ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ఆయన ఇలా పేర్లు పెట్టారని తారకరత్న సన్నిహితులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని