Taraka Ratna: తారకరత్న లేటెస్ట్‌ హెల్త్‌ అప్‌డేట్‌.. ఏ ట్రీట్‌మెంట్‌ జరుగుతోందంటే?

నటుడు నందమూరి తారకరత్నహెల్త్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఎం. ఆర్‌. ఐ స్కానింగ్‌ చేసిన అనంతరం వైద్యులు ఏమన్నారంటే?

Updated : 16 Feb 2023 19:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న(Taraka Ratna)కు బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana Hrudayalaya)లో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి తాజాగా అప్‌డేట్‌ వచ్చింది. గురువారం తారకరత్నకు ఎం.ఆర్‌.ఐ స్కానింగ్‌ చేశారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మెదడుకు సంబంధించిన వైద్య సేవలు కొనసాగుతున్నాయని వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన హెల్త్‌ బులిటెన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి. జనవరి 27న కుప్పంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తారకరత్నకు గుండెపోటు రాగా ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. విదేశీ వైద్యులను ఆ ఆస్పత్రికి రప్పించి ట్రీట్‌మెంట్‌ చేయిస్తున్నట్టు ఆయన కుటుంబ సభ్యుడు రామకృష్ణ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని