Taraka Ratna - Balakrishna: ఎవరూ చూడని సమయంలో బాలకృష్ణ కన్నీరు పెట్టుకున్నారు!

బాలకృష్ణను ఉద్దేశిస్తూ తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి (Alekya) ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.

Updated : 14 Mar 2023 19:37 IST

హైదరాబాద్‌: నందమూరి తారక రత్న (Taraka ratna) మరణించి రోజులు గడుస్తున్నా అభిమానులు ఇంకా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన భార్య అలేఖ్య రెడ్డి  కూడా ఆయన్ని గుర్తుచేసుకుంటూ తరచూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు చేస్తోంది. తాజాగా ఆమె  బాలకృష్ణ (Balakrishna) ను ఉద్దేశిస్తూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. ఆపదలో ఉన్నప్పుడు, అవసరమైనప్పుడు అండగా ఉన్నారని తలచుకుంటూ భావోద్వేగానికి గురైంది అలేఖ్య. ఈ మేరకు ఓ అభిమాని ఎడిట్‌ చేసిన ఫొటోను షేర్‌ చేస్తూ అతడికి ధన్యవాదాలు తెలిపింది. 

తారక రత్నను ఎంతో మిస్సవుతున్నట్లు తెలిపిన అలేఖ్య.. బాలకృష్ణను ఉద్దేశిస్తూ ‘‘మేం కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి. మంచి చెడుల్లో మాకు కొండంత అండగా ఉన్న ఒకే ఒక వ్యక్తి. తారక రత్నను ఆసుపత్రికి తీసుకెళ్లిన వేళ తండ్రిలా ఉన్నారు. ఆసుపత్రి బెడ్‌పై తన పక్కన కూర్చొని ఒక తల్లిలా పాట పాడారు. తను ప్రతిస్పందించాలని ప్రయత్నిస్తూ జోకులు వేశారు. ఎవ్వరూ చూడనప్పుడు కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ఆయన అన్ని వేళలా మా వెంటే ఉన్నారు. ఈ ఫొటోను ఎవరు ఎడిట్‌ చేశారో తెలీదు కానీ వాళ్లకు నా ధన్యవాదాలు’’ అంటూ తారక రత్న పిల్లలతో బాలకృష్ణ ఉన్న ఫొటోను షేర్‌ చేసింది అలేఖ్య. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తారకరత్న అనారోగ్యానికి గురైనప్పటి నుంచి బాలకృష్ణ ఆ కుటుంబంతో ఉన్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని