Viswaksen: ‘ఎన్ని సంబంధాలు చూశానో లెక్కపెట్టలేదు’: విశ్వక్‌సేన్‌

‘‘ఇప్పటివరకూ ఎన్ని సంబంధాలు చూశానో లెక్కపెట్టలేదు’’ అని అంటున్నారు నటుడు విశ్వక్‌సేన్‌. ఆయన ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’....

Updated : 02 Feb 2022 12:53 IST

హైదరాబాద్‌: ‘‘ఇప్పటివరకూ ఎన్ని సంబంధాలు చూశానో లెక్కపెట్టలేదు’’ అని అంటున్నారు నటుడు విశ్వక్‌సేన్‌. ఆయన ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జునకళ్యాణం’. విద్యాసాగర్‌ చింతా దర్శకుడు. రుక్సార్ ధిల్లాన్ కథానాయిక. పూర్తి స్థాయి కుటుంబకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విశ్వక్‌సేన్‌ పెళ్లి కోసం ఎదురుచూసే వ్యక్తిగా కనిపించారు. వయసు ఎక్కువగా ఉన్న కారణంగా ఎంతోమంది అమ్మాయిలు ఆయన్ని తిరస్కరించడం.. చివరికి, రుక్సార్‌తో పెళ్లి చూపులు.. ఆమెతో ప్రేమలో పడటం వంటి ఆసక్తికర అంశాలతో ఈచిత్రం రూపుదిద్దుకుంది.

తాజాగా ఈసినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో విశ్వక్‌సేన్‌ నటన, ఆహార్యం, సంభాషణలు నవ్వించేలా ఉన్నాయి. అమాయకంగా కనిపించే యువతిగా రుక్సార్‌ మెప్పించారు. టీజర్‌ చివర్లో విశ్వక్‌సేన్‌ మద్యం సేవించి.. ‘‘ఛీ.. తాగితే కానీ మా బతుకులకు ఏడుపురాదు. తాగినోడి ఏడుపుకేమో విలువ లేదు’’ అంటూ హీరోయిన్‌తో చెప్పే డైలాగ్‌లు యువతను కనెక్ట్‌ చేసేలా ఉన్నాయి. మరి, పెళ్లి కోసం ఎదురుచూసే వ్యక్తికి (విశ్వక్‌సేన్‌).. అతనికంటే వయసులో చిన్నదైన యువతి (రుక్సార్‌) ఓకే చెప్పిందా? వీళ్ల పెళ్లి ఎలా జరిగింది?.. తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. మార్చి 4న ఈసినిమా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని