Tees Maar Khan: ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ పవర్‌ ఎంతంటే?

‘తుపాకీ పట్టుకున్నాక కూడా పోలీసు అని నమ్మరా?’ అని ప్రశ్నిస్తున్నాడు ఆది సాయికుమార్‌.

Updated : 07 Dec 2022 16:34 IST

తుపాకీ పట్టుకున్నాక కూడా పోలీసు అని నమ్మరా?’ అని ప్రశ్నిస్తున్నాడు ఆది సాయికుమార్‌. ఆయన ఎందుకలా అనాల్సి వచ్చిందో తెలియాలంటే ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ చిత్రం చూడాల్సిందే. కల్యాణ్‌ జి. గోగణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ‘మా అన్న ఏమయ్యాడో.. అంటూ మొదలయ్యే టీజర్లో... మనం ఆపలేనంత పవర్‌ వాడిదగ్గర ఉంది’ అనే ఆసక్తికర డైలాగులతో సాగింది. ఇందులో ఆది విద్యార్థి, రౌడీ, పోలీస్‌...గా కనిపించనున్నారు. పాయల్‌ రాజ్‌పూత్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, పూర్ణ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. దీనికి సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: బాల్‌రెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని