Tees Maar Khan: పవర్‌ఫుల్‌గా ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ ట్రైలర్‌.. విభిన్న లుక్స్‌తో ఆది

స్టూడెంట్‌, రౌడీ, పోలీస్‌.. ఈ మూడు విభిన్న పాత్రల్లో ఆది నటించిన చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’. కల్యాణ్‌జీ గొగన దర్శకత్వం వహించారు.

Updated : 07 Dec 2022 17:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: స్టూడెంట్‌, రౌడీ, పోలీస్‌.. ఈ మూడు విభిన్న పాత్రల్లో ఆది (Aadi) నటించిన చిత్రం ‘తీస్‌ మార్‌ ఖాన్‌’ (Tees Maar Khan). కల్యాణ్‌జీ గొగన దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ‘మా అమ్మని తప్పుగా చూశారు. మా అమ్మ జోలికొస్తే ఎవరినైనా కొడతా’ అంటూ హీరో చిన్నప్పటి పాత్రతో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం పవర్‌ఫుల్‌గా సాగింది. విలన్‌, హీరో మధ్య సాగే సన్నివేశాలు చూస్తుంటే ఈ సినిమా పూర్తి స్థాయిలో మాస్‌ నేపథ్యంలో తెరకెక్కిందని అర్థమవుతోంది. ఆది లుక్స్‌, చెప్పిన సంభాషణలు అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలో ఆది సరసన పాయల్‌ రాజ్‌పుత్ నటించింది. సునీల్‌, పూర్ణ, కబీర్‌ సింగ్‌, అనూప్‌ సింగ్‌ ఠాకూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని