Ahimsa: ఈ సినిమాలోనూ హీరో, హీరోయిన్‌ను కొట్టారా? విలేకరి ప్రశ్నకు తేజ స్ట్రాంగ్ రిప్లై!
Ahimsa: అహింస సినిమా కోసం కథానాయకుడు అభిరామ్ చాలా కష్టపడ్డాడని, తాను ఇచ్చిన టాస్క్‌లన్నీ చేశాడనీ దర్శకుడు తేజ అన్నారు.
హైదరాబాద్: ‘అహింస’ (Ahimsa) సినిమా కోసం అభిరామ్ (Abhiram Daggubati) ఎంతో కష్టపడ్డాడని, చెప్పిందల్లా కాదనకుండా చేశాడని దర్శకుడు తేజ (Teja) అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ప్రశ్నిస్తూ ‘సినిమాలో హింస చూపిస్తూ అహింస అని ఎందుకు పెట్టారు’ అని అడగ్గా, ‘ఎందుకు తీయకూడదు. అహింస అని టైటిల్ పెట్టి, గాంధీగారితో తీయాలా? ఇందులో హింస కరెక్టా.. అహింస కరెక్టా అనేది చూపిస్తాం. అందుకే ఆ టైటిల్‌పెట్టాం’ అని తేజ సమాధానం ఇచ్చారు. అలాగే ‘మీ సినిమాల్లో హీరో, హీరోయిన్‌లను కొడతారని అంటారు. ఇందులోనూ వాళ్లని ఏమైనా కొట్టారా? అని అడగ్గా, ‘నేను కొట్టింది మీరు చూశారా’ అంటూ ఎదురు ప్రశ్నించారు. సినిమా కోసం అభిరామ్‌ను టార్చర్ పెట్టింది వాస్తమేనని తేజ చెప్పుకొచ్చారు.
‘‘రామానాయుడు స్టూడియో కింద నుంచి కొండపై వరకూ రోజూ సైకిల్ తొక్కమని అభికి చెప్పా. ‘నేను చేయలేను’ అనకుండా ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత ఆ సీన్ లేదని తీసేశా. ఆ తర్వాత భుజంపై అమ్మాయిని ఎత్తుకుని, మరో భుజానికి తుపాకులు తగిలించుకుని పరిగెత్తమని చెప్పా. ఆ షాట్ తీస్తుండగా, అక్కడ జారిపడి మోకాలికి దెబ్బ తగిలింది. నాలుగు నెలలు సినిమా ఆగింది. తగ్గిన తర్వాత మళ్లీ 50 కిలోల బరువు ఎత్తుకుని కొండ చుట్టూ పరిగెత్తమని చెప్పా. రోజూ పరిగెత్తి వీడియో పెట్టేవాడు. ఇంతకన్నా టార్చర్ ఎవరైనా పెడతారా? నేను చెప్పినవన్నీ చేసే అవసరం అభిరామ్‌కు లేదు. పెద్ద ఫ్యామిలీ, ప్రొడక్షన్ హౌస్ ఉన్నా, ఎందుకు కష్టపడ్డాడంటే అతనిలో నిజాయతీ ఉంది. అందుకే ఈ సినిమా అభితో చేశా’’ అని చెప్పుకొచ్చారు. మరి వెంకటేశ్‌తో ‘సావిత్రి’ అనే సినిమా ప్రకటించారు. ఎప్పుడు చేస్తారు? అని అడగ్గా, ‘భవిష్యత్‌లో ఏం చేస్తానో ఆలోచించను. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించి చేస్తా. దాంతోనే తృప్తి పడతా. వెంకటేశ్‌తో తీద్దామనుకున్న సావిత్రి కథ పోయింది’ అని తేజ సమాధానం ఇచ్చారు. ఇక ‘అహింస’ విషయాకొనిస్తే, అభిరామ్ దగ్గుబాటి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమిది. గీతిక తివారీ కథానాయిక. సదా కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయి: రేవంత్‌రెడ్డి
-
Suryakumar Yadav: ఇన్నాళ్లూ తికమక పడ్డా.. నా కొత్త పాత్రను ఇష్టపడుతున్నా: సూర్యకుమార్
-
2 Year Old Girl: రాత్రి సమయంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి.. చివరకు..!
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ప్రభాస్‌తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
Congress-CPI: కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. చర్చలు కొనసాగుతున్నాయ్: చాడ వెంకట్‌రెడ్డి
-
Amazon: గ్రేట్ ఇండియన్ సేల్కు అమెజాన్ రెడీ.. వీటిపైనే డీల్స్!