Teja: అమ్మానాన్నా చనిపోయాక.. చుట్టాలు మమ్మల్ని పంచుకున్నారు: తేజ

చిన్నప్పుడే తాను ఎన్నో ఇబ్బందులు చూశానని దర్శకుడు తేజ (Teja) చెప్పారు. ఆర్థికంగా ఉన్నత స్థితి నుంచి ఫుట్‌పాత్‌పై పడుకున్న రోజులు కూడా తాను చూశానని చెప్పారు. 

Published : 27 May 2023 15:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘అహింస’ (Ahimsa) సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు దర్శకుడు తేజ (Teja). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే తన బాల్యం గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయానని చెప్పిన ఆయన.. గతంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు చూశానని చెప్పారు.

‘‘మాది చెన్నై. నాకు ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. చిన్నప్పుడు మాకు ఆస్తులు బాగానే ఉండేవి. నాకు ఊహ తెలిసే సరికి అమ్మ చనిపోయారు. ఆ బెంగతో నాన్న అనారోగ్యానికి గురై కొంతకాలానికే కన్నుమూశారు. దాంతో పరిస్థితులు మారిపోయాయి. బంధువులు మమ్మల్ని పంచుకున్నారు. అక్క ఒక చోట, నేనూ చెల్లి మరోచోట పెరగాల్సి వచ్చింది. మమ్మల్ని చూసుకున్నందుకుగానూ వాళ్లు కొన్ని ఆస్తులు తీసుకున్నారు. అలా, ఓరోజు నన్ను ఆరుబయట నిద్రపోమన్నారు. అంతే, ఆ రాత్రి అక్కడి నుంచి పారిపోయాను. ఫుట్‌పాత్‌పై పడుకున్న రోజుల నుంచి నేను ఈస్థాయికి వచ్చానంటే కేవలం సినిమా వల్లే. ‘నిజం’ అనుకున్నంతగా ఆడకపోవడంతో సినిమాపై ఏకాగ్రత కోల్పోయాను. ఆ తర్వాత మా అబ్బాయికి అనారోగ్య సమస్యలు రావడంతో సుమారు నాలుగేళ్లపాటు సినిమాకు దూరంగా ఉన్నాను. సమస్యలు మళ్లీ మొదలయ్యాయి. ‘నేనే రాజు నేనే మంత్రి’తో తిరిగి హిట్‌ అందుకున్నాను’’ అని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని