Director Teja: నమ్మిన వాళ్లే నన్ను అవమానించారు: తేజ
రానా దగ్గుబాటి సోదరుడు అభిరామ్ హీరోగా ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’. ఈ సినిమా జూన్ 2న విడుదల కానున్న నేపథ్యంలో తేజ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు.
హైదరాబాద్: నమ్మిన వాళ్లే కొంతమంది తనను మోసం చేశారని దర్శకుడు తేజ (Teja) అన్నారు. పలు సందర్భాల్లో మోసపోయినప్పటికీ ఎదుటి వ్యక్తిని నమ్మడం మానలేదని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ‘‘సాధారణంగా నేను ఎదుటి వ్యక్తిని గుడ్డిగా నమ్మేస్తుంటా. అదే నాకు ఉన్న పెద్ద సమస్య. కొన్ని సందర్భాల్లో నమ్మిన వ్యక్తులే నన్ను మోసం చేశారు. పేదలు, కష్టపడే వాళ్లను నమ్మి సినిమాలు చేసి, బ్రేక్ ఇచ్చా. అలా కొంతమంది కోటీశ్వరులయ్యారు. సంతోషంగా జీవిస్తున్నారు. నేను స్టార్స్ చేసిన వారిలో పలువురు నన్ను అవమానించారు. అయినా సరే వాళ్లను నమ్మడం మానను. ఎందుకంటే వాళ్లను నమ్మడం మానేసి.. ఆవేదనకు గురైతే వాళ్లే గెలిచినట్టు అవుతుంది. అది నాకు ఇష్టం లేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా జనాలను నమ్ముతూనే ఉంటా’’ అని ఆయన తెలిపారు.
సినిమాల విషయానికి వస్తే తేజ దర్శకత్వం వహించిన కొత్త చిత్రం ‘అహింస’ (ahimsa). ప్రముఖ హీరోగా రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ (abhiram daggubati) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తన కెరీర్, లైఫ్ స్టైల్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో జనాలను ఎక్కువగా నమ్మేస్తుంటానని, దానివల్ల పలు సందర్భాల్లో ఇబ్బందులు పడ్డానని చెప్పారు. ఓ సందర్భంలో.. తన జీవితంలోని చేదు అనుభవాలు గుర్తుచేసుకున్నారు. మరో సందర్భంలో.. హీరో ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ తనకు తెలుసని షాకింగ్ కామెంట్స్ చేశారు. దీని గురించి ఇటీవల ప్రశ్న ఎదురవగా.. ‘‘ఉదయ్ డెత్ గురించి చాలామందికి తెలుసు. కానీ, ఏం తెలియనట్టు నటిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు తప్పక చెబుతానన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TATA Sons IPO: అదే జరిగితే.. భారత్‌లో అతిపెద్ద ఐపీఓ టాటా గ్రూప్ నుంచే!
-
WhatsApp Channel: వాట్సాప్ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్ పోస్ట్ చేసిన ప్రధాని మోదీ
-
Team India: ఇక్కడో జట్టు.. అక్కడో జట్టు.. కొత్త పుంతలు తొక్కుతున్న భారత క్రికెట్
-
800 Movie: విజయ్ సేతుపతి కుటుంబాన్ని బెదిరించారు: ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యలు
-
Hyderabad: గణేశ్ నిమజ్జనానికి MMTS ప్రత్యేక సర్వీసులు.. టైమింగ్స్ ఇవే..!
-
Hyderabad: తెలంగాణ పోలీసింగ్ ఓ సక్సెస్ స్టోరీ: డీజీపీ