ఆ జానర్‌లో మొదటి తెలుగు చిత్రం ‘జాంబిరెడ్డి’

ఈ సంక్రాంతికి మరో ఆసక్తికర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో

Published : 03 Jan 2021 02:17 IST

హైదరాబాద్‌: ఈ సంక్రాంతికి మరో ఆసక్తికర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ సజ్జా, ఆనంది కీలక పాత్రల్లో ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాంబిరెడ్డి’. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ అభిమానులతో పంచుకున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే పరిమితమైన ‘జాంబి’ జానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుంది. ‘కరోనా వైరస్‌ బ్యాడ్‌ అయితే, దాని డాడ్‌ ఎవరో చెప్పగలరా’ అంటూ విడుదల చేసిన ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. తెలుగులో మొదటి జాంబి జానర్‌ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని