Tollywood: షూటింగ్స్‌ ఆపితే ఊరుకునేది లేదు: రామకృష్ణ గౌడ్‌

ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేస్తామన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని

Updated : 30 Jul 2022 19:47 IST

హైదరాబాద్‌: ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేస్తామన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డిమాండ్ చేసింది. నలుగురు నిర్మాతల స్వప్రయోజనాల కోసం టికెట్ ధరలు పెంచడం, చిత్రీకరణలు నిలిపివేయడం వల్ల వేల మంది సినీ కార్మికులతోపాటు చిన్న నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ విమర్శించారు. టికెట్ ధరలను తగ్గించడంతోపాటు థియేటర్లలో పర్సంటేజీలను పక్కాగా అమలు చేయాలని రామకృష్ణగౌడ్ డిమాండ్ చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ లోని కొందరు నిర్మాతలు అత్యాశతో హీరోల పారితోషికాలు వందలకోట్లు పెంచారని ఆరోపించిన రామకృష్ణగౌడ్... సినిమా షూటింగ్స్ ఆపేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని