తెలంగాణలో రేపటి నుంచి థియేటర్లు ఓపెన్‌!

సినిమా థియేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ కోరింది. ఈ మేరకు ఛాంబర్‌ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిశారు. రాష్ట్రంలో థియేటర్ల పునఃప్రారంభానికి చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు మెమొరాండం అందజేశారు.

Updated : 17 Jul 2021 19:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో ఆదివారం నుంచి సినిమా థియేటర్లను తెరవాలని రాష్ట్ర ఎగ్జిబిటర్ల అసోసియేషన్ నిర్ణయించింది. లాక్‌డౌన్ వల్ల థియేటర్లు తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఎగ్జిబిటర్లు పలుమార్లు తమ బాధలను ప్రభుత్వానికి విన్నవించారు. తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్లి వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి థియేటర్లను ఆదుకునేందుకు స్పష్టమైన హామీ రావడంతో ఆదివారం నుంచి సినిమా హాల్స్ తెరవాలని తెలంగాణ ఫిల్మ్ చాంబర్, థియేటర్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయం తీసుకుంది. ఎగ్జిబిటర్లు ఎవరైనా రేపటి నుంచి సినిమాలను ప్రదర్శించుకోవచ్చని, ఈ నెల 23 నుంచి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్న దృష్ట్యా థియేటర్లు తెరుచుకోవచ్చని సూచించింది. ప్రభుత్వం ఇప్పటికే 100 శాతం సీట్ల సామర్థ్యంతో అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని మల్టీఫ్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగించాలని తీర్మానించినట్లు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కార్యదర్శి విజయేందర్ రెడ్డి తెలిపారు.

తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రభుత్వానికి చేసిన వినతులు..

* 2017లో తీసుకొచ్చిన జీఓ.75 విషయంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించాలి.

* సినిమా థియేటర్‌కు వచ్చే వాహనదారుల నుంచి పార్కింగ్‌ రుసుము వసూలు చేసేందుకు అనుమతి ఇవ్వాలి.

* లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్లు అన్ని మూతపడి ఉన్నాయి. అయినా విద్యుత్తుశాఖ నామమాత్రపు ఛార్జీలు విధించింది. ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలి. 

* కరోనా వల్ల ఆదాయం లేకపోవడంతో ఎగ్జిబిటర్లు తీవ్రనష్టాలు చవిచూశారు. వాళ్లకు ఉపశమనం కలిగించేందుకు రెండేళ్ల పాటు మున్సిపల్‌/ప్రాపర్టీ ట్యాక్స్‌ నుంచి మినహాయింపు కల్పించాలి.

* జీఎస్‌టీ తగ్గించి సినిమా థియేటర్లను కాపాడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని