TS News: సినిమా థియేటర్లకు ఊరట

కరోనా వైరస్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. థియేటర్లకు

Updated : 20 Jul 2021 19:44 IST

హైదరాబాద్‌: కరోనా వైరస్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లకు తెలంగాణ ప్రభుత్వం ఊరట కల్పించింది. థియేటర్లకు ఆర్థికంగా వెసులుబాటు కలిగేలా పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి రాష్ట్రంలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్ల వద్ద యాజమాన్యం సినిమాకు వచ్చే ప్రేక్షకుల నుంచి వాహనాల పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

2018లో పార్కింగ్ ఫీజులను రద్దు చేస్తూ జారీ చేసిన జీవో నెం.63ను సవరిస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే వర్తిస్తాయని, మల్టీఫ్లెక్స్ లు, వ్యాపార వాణిజ్య సముదాయాల్లో ప్రజల నుంచి పార్కింగ్ ఫీజులు వసూలు చేయవద్దని ఆదేశించింది. ఇందుకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులే అమల్లో ఉంటాయని పేర్కొంది. చాలామంది సినిమా థియేటర్ల వద్ద వాహనాలు పార్కింగ్ చేసి వెళ్లడం, పర్యవేక్షణ లేకపోవడంతో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న యాజమాన్యాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. థియేటర్ల వద్ద నిలిపి ఉంచే వాహనాలకు నిర్ణీత రుసుము వసూలు చేసి వాటి పర్యవేక్షించాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని