Published : 20 Mar 2021 20:41 IST

తెలుగు సినిమాల్లో నటించటం నా అదృష్టం

మొదటి సినిమాను ఒక మంచి నిర్మాణ సంస్థలో చెయ్యటం తన అదృష్టమంటోంది హీరోయిన్‌ మిషా నారంగ్‌. తాజాగా ఆమె వారాహి సంస్థ నిర్మిస్తోన్న ‘తెల్లవారితే గురువారం’ చిత్రంలో కథానాయికగా సింహా కోడూరి సరసన నటిస్తోంది. మరి ఆ చిత్ర విశేషాల గురించి మిషా చెబుతున్న సంగతులేంటో చూద్దామా!

* నా స్వస్థలం హరియాణాలోని కురుక్షేత్ర. ప్రస్తుతం సినిమాల్లో రాణించాలని ముంబయిలోనే ఉంటున్నా. అలా ఆడిషన్స్‌ ఇస్తూ అవకాశాల కోసం చూస్తుండగా ‘తెల్లవారితే గురువారం’లో ఆఫర్‌ వచ్చింది. కెమెస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశా.

*2019లో ముందు ‘మిస్సింగ్‌’అనే చిత్రంలో నాకు అవకాశం వచ్చింది. తర్వాత కరోనా కారణంగా ఆ చిత్ర షూటింగ్‌ వాయిదా పడింది. ఆ సమయంలోనే వారాహి సంస్థ వాళ్లు నా ప్రొఫైల్‌ చూశారు. నన్ను సంప్రదించి కథ వివరించారు. వింటున్నప్పుడే చాలా ఎగ్జైటింగ్‌గా ఫీలయ్యా. ఇందులో నా పాత్ర పేరు ‘మధు’. నిజ జీవితంలో ఆ పాత్ర మాదిరిగానే నా మనస్తత్వం ఉంటుంది. దీంతో వెంటనే ఓకే చెప్పేశా. పాత్రలో అనేక కోణాలుంటాయి.

* ఈ చిత్రంలోని పాటలన్నీ బాగుంటాయి. ‘ఏమైంది..’అంటూ సాగే పాట నాకు చాలా ఇష్టమైంది. ఇక కథ విషయానికొస్తే తెల్లవారితే గురువారమనగా పెళ్లి జరగబోతున్న క్రమంలో అనుకోకుండా ఎదురయ్యే సమస్యల సమాహారమే ఈ చిత్రం. 

*వారాహి వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో పనిచేయడం చాలా ఆనందం ఉంది. ఇందులో నా సహనటులైనా సింహా కోడూరి, చిత్రతో మంచి అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా సింహాతో కలిసి నటిస్తున్నప్పుడు ఎంతో ప్రోత్సహించేవాడు. డైరెక్టర్‌ మణికాంత్‌ సీన్స్‌ వివరించే విధానం చాలా బాగుంటుంది. నేను తెలుగు భాషకు కొత్త కావడంతో నాకున్న సందేహాలు తీర్చేవారు. అలాగే చిత్రతో గతంలో ఒక థియేటర్‌ షోలో కలిసి నటించాను. ఇప్పుడు బాగా ఫ్రెండ్స్‌ అయ్యాం. తెలుగు ఇండస్ట్రీలో భాగమవ్వడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా.

*నటి సాయిపల్లవి అంటే ఎంతో ఇష్టం. ఎంతో సహజంగా నటిస్తుంది. ‘ఫిదా’ చిత్రం ఎన్నో సార్లు చూశా. అలాగే విజయ్‌ దే‌వరకొండ, కాజల్‌  అగర్వాల్‌లను ఎంతో అభిమానిస్తా. 

*ఇక మా కుటుంబ విషయానికొస్తే తండ్రి ఓ కళాశాలకు ప్రిన్సిపాల్‌, అమ్మ టీచర్‌. అందరూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్లే. నేనూ వారి బాటలోనే నడుద్దామనుకున్నా. కానీ, నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలనే ఉద్దేశంతో ఈ రంగంలోకి వచ్చా.

* ప్రత్యేకంగా డ్రీమ్స్‌రోల్స్‌ అంటూ ఏమి లేవు. ఏ పాత్రలో నటించిన పూర్తి న్యాయం చేసేందుకు కష్టపడతా. ఆర్మీ, ఐఏఎస్‌ సంబంధించిన పాత్రల్లో నటించాలనే ఆశ ఉంది. కన్నడ, తమిళ సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. అయితే తెలుగుకే నా మొదటి ప్రాధాన్యం.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని