Updated : 07 Nov 2021 07:00 IST

Skylab Trailer: ‘స్కైలాబ్‌’నాకు ప్రత్యేకం!

నిత్యమేనన్‌

గౌరి... ఆనంద్‌... సుబేదార్‌ రామారావు.  - బండ లింగంపల్లికి చెందిన ఈ ముగ్గురూ ఒకొక్కరు ఒక్కో లక్ష్యంతో ముందుకు సాగుతుంటారు. తమ కలలు నెరవేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే అనుకుంటారు. సరిగ్గా అప్పుడే అంతరిక్షంలోకి వెళ్లిన స్కైలాబ్‌ ఉపగ్రహం సాంకేతిక కారణాలతో భూమిపై పడతుందనే విషయం తెలుస్తుంది. అదీ బండ లింగంపల్లిలోనే పడుతుందనే ప్రచారం మొదలవుతుంది. మరి అప్పుడు అందరి జీవితాల్లో ఎలాంటి మార్పులొచ్చాయి? గౌరి, ఆనంద్‌, సుబేదార్‌ రామారావు కన్న కలలు ఏమిటి? అవి ఎలా నెరవేరాయన్నది ‘స్కై లాబ్‌’లో చూసి తెలుసుకోవల్సిందే. సత్యదేవ్‌, నిత్యమేనన్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రమిది. విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వం వహిస్తున్నారు. పృథ్వీ పిన్నమరాజు నిర్మాత. డా.రవి   కిరణ్‌ సమర్పిస్తున్నారు. 1979 నేపథ్యంలో సాగే ఈ చిత్ర నిర్మాణంలో నిత్యమేనన్‌ కూడా భాగం పంచుకుంటున్నారు. డిసెంబర్‌ 4న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. శనివారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. నిత్యమేనన్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దర్శకుడు కథ చెప్పినప్పుడు ఎవరూ ఎందుకు సినిమాగా చేయలేదనే ఆలోచనలో పడిపోయా.  పాత తరానికి తెలిసిన విషయం, నేటి తరానికి కొత్త విషయం కాబట్టి అందరికీ కనెక్ట్‌ అవుతుందని భావించాం. ఇలాంటి సినిమాలు చేయడమే నా కల. విభిన్నమైన సినిమా చేశాననే అనుభూతి కలిగింది. నిర్మాణంలో భాగం కావడం గర్వంగా ఉంది. నటిగా, నిర్మాతగా ఇంకా భవిష్యత్తులో ఇలాంటి సినిమాలు చేయాలని ఉంది. నిర్మాతలు, నటీనటులు మేమంతా అనుభూతి చెందిన  చేసిన సినిమా ఇది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘కడుపుబ్బా నవ్వించే చిత్రమిది. ట్రైలర్‌లో నాకు నేను కొత్తగా కనిపించా. నిత్యమేనన్‌తో కలిసి నటించడం నా అదృష్టం. రాహుల్‌తో పనిచేయడం ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. ‘స్కై లాబ్‌’ గొప్ప సినిమా అవుతుంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ కథని ముందు రాహుల్‌కి చెప్పా. అక్కడి నుంచి మొదలైంది నా ప్రయాణం. రాహుల్‌, నిత్యమేనన్‌, సత్యదేవ్‌లాంటి అద్భుతమైన నటులతో పనిచేయడం నా అదృష్టమ’’న్నారు. ఈ     కార్యక్రమంలో నిర్మాత, చిత్ర సమర్పకుడు రవికిరణ్‌ తదితర చిత్రబృందం పాల్గొంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని