బిగ్‌బాస్‌ ఫేం మోనల్‌-అఖిల్‌ కొత్త వెబ్‌సిరీస్‌

బుల్లితెరపై అలరించిన బిగ్‌బాస్‌ జంట అఖిల్‌ సార్థక్‌, మోనాల్‌ గజ్జర్‌ ఇప్పుడు మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ‘తెలుగు అబ్బాయి.. గుజరాత్‌ అమ్మాయి’ పేరుతో

Updated : 27 Feb 2021 16:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెరపై అలరించిన బిగ్‌బాస్‌ జంట అఖిల్‌ సార్థక్‌, మోనాల్‌ గజ్జర్‌ ఇప్పుడు మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ‘తెలుగు అబ్బాయి.. గుజరాత్‌ అమ్మాయి’ పేరుతో భాస్కర్‌ బంటుపల్లి దర్శకత్వంలో వీరిద్దరూ జోడీగా నటిస్తున్నారు. సరస్వతి క్రియేషన్స్‌ పతాకంపై భాస్కర్‌రావు నిర్మిస్తున్నారు. సాకేత్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన మోషన్‌పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టైటిల్‌, పోస్టర్‌ను బట్టి.. తెలుగు అబ్బాయికి.. గుజరాత్‌ అమ్మాయికి మధ్య సాగే ప్రేమకథ ఆధారంగా వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. బిగ్‌బాస్‌ షోలో సీరియల్‌ నటుడు అఖిల్‌ వెలుగులోకి రాగా.. మోనాల్‌ ఇప్పటికే పలు చిత్రాల్లో నటించింది. ‘సుడిగాడు’ వంటి హిట్‌ చిత్రాలతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ, గుజరాతీ చిత్రాల్లోనూ నటించిందామె. వీరిద్దరూ కలిసి బిగ్‌బాస్‌ సీజన్‌4లో కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

సినిమాల్లో ‘ప్రేమ’కు నిర్వచనాలు

పెళ్లి పీటలెక్కనున్న కీర్తి సురేశ్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని