MAA Election ‘మా’ అధ్యక్ష బరిలో హేమ

తెలుగు సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల సందడి ఊపందుకుంది. కొత్త కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష స్థానం కోసం ఎప్పుడూ లేని రీతిలో పోటీ నెలకొంది...

Published : 24 Jun 2021 15:08 IST

తెలుగు సినీ పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల సందడి ఊపందుకుంది. కొత్త కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష స్థానం కోసం ఎప్పుడూ లేని రీతిలో పోటీ నెలకొంది. తాజాగా సీనియర్‌ నటి హేమ తానూ పోటీకి దిగుతున్నట్టు బుధవారం ప్రకటించారు. ‘‘కొన్నేళ్లుగా ‘మా’లో కార్యవర్గ సభ్యురాలిగా, ఉపాధ్యక్షు రాలిగా పదవులు చేపట్టాను. ఈసారి ట్రెజరర్‌ పదవికి పోటీ చేయాలనుకున్నా. కానీ నా ఆలోచన మారింది. పోటీ చేయమని నా వాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారు. వారందరి కోసం అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నా’’ అన్నారు హేమ.

మరికొంతమంది ముందుకొస్తారా?  
ఎన్నికలకి ఇంకా సమయం ఉంది కాబట్టి మరికొంత మంది నటులు అధ్యక్ష పదవికి పోటీ చేయడం కోసం ముందుకొచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొదట ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు ఎన్నికల బరిలో నిలవనున్నట్టు పరిశ్రమ వర్గాలు మాట్లాడుకున్నాయి. విష్ణు తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి పరిశ్రమలోని పలువురు ప్రముఖుల్ని కలిసి ఎన్నికల్లో మద్దతు కోరారు. ప్రకాష్‌రాజ్‌కూ చిత్ర పరిశ్రమలోని ఓ వర్గం మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్‌ నటి, ప్రస్తుతం ‘మా’ కార్యదర్శిగా కొనసాగుతున్న జీవిత కూడా ఈసారి అధ్యక్ష పదవి కోసం బరిలోకి
దిగుతున్నట్టు ప్రకటించారు. దాంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఈసారి ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నవాళ్లందరి ప్రధాన హామీ అసోసియేషన్‌కి సొంత భవనం నిర్మించడమే. మరి చివరికి ఎవరెవరు పోటీలో నిలుస్తారనేది చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని