RamGopal Varma: ప్రియురాలి పేరునే శ్రీదేవికి పెట్టుకున్న ఆర్జీవీ

అతిలోక సుందరి, అలనాటి నటి శ్రీదేవి అంటే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు అమితమైన అభిమానం. ఆ ఇష్టంతోనే ‘క్షణ క్షణం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాల్లో శ్రీదేవినే హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు...

Published : 26 Aug 2021 12:28 IST

హైదరాబాద్‌: అతిలోక సుందరి, అలనాటి నటి శ్రీదేవి అంటే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు అమితమైన అభిమానం. ఆ ఇష్టంతోనే ‘క్షణ క్షణం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాల్లో శ్రీదేవినే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కాగా, వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘క్షణ క్షణం’ సినిమాలో శ్రీదేవి పాత్రకు ‘సత్య’ అనే పేరు పెట్టడం వెనుకున్న కథను తాజాగా ఆర్జీవీ వెల్లడించారు. తన ప్రేమ కథ గురించి తొలిసారి నెటిజన్లకు తెలియజేశారు. అంతేకాకుండా తను ఇష్టపడిన మహిళ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు.

‘నా జీవితంలో మొట్టమొదటి ప్రేయసి పేరు సత్య. విజయవాడలోని సిద్దార్థ ఇంజనీరింగ్‌ కళాశాలలో చదువుకుంటున్న రోజుల్లో ఆమెతో ప్రేమలో పడ్డాను. తను మెడికల్‌ స్టూడెంట్‌. ఆ రోజుల్లో మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలు ఒకేచోట ఉండేవి. అక్కడే సత్యతో నా వన్‌ సైడ్‌ లవ్‌ మొదలైంది. వేరే డబ్బున్న కుర్రాడు కారణంగా తను నా ప్రేమను పట్టించుకోదని భావించాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అదే స్టోరీతో ‘రంగీలా’ చిత్రాన్ని తెరకెక్కించాను. అది ఒక్కటే కాదు ‘సత్య’, ‘క్షణక్షణం’లో శ్రీదేవి పాత్ర పేరు కూడా ఈమెను ఉద్దేశించే పెట్టాను’ అని వర్మ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని