pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎంను కలవనున్న తెలుగు సినీ నిర్మాతలు

తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ను కలిసి మూవీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురానున్నారు.

Published : 23 Jun 2024 20:38 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో (Pawan Kalyan) తెలుగు సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. సోమవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన సమావేశం జరగనుంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు,  తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను పవన్‌కు వివరించనున్నారు. అలాగే, సినిమా టిక్కెట్ల ధర పెంపు విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరనున్నారు. థియేటర్ల సమస్యలపైనా ఈ సందర్భంగా చర్చించనున్నారు. నిర్మాతలు అశ్వనీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్యలతో పాటు, ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదరప్రసాద్ తదితరులు పవన్‌ను కలిసే వారిలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని