TFCC: తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలి: ఫిల్మ్ ఛాంబర్
వైజాగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌కు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ రాసింది. తెలుగు సినిమాల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరింది.
ఇంటర్నెట్ డెస్క్: దసరా, సంక్రాంతి పండగ రోజుల్లో తెలుగు సినిమాల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ ఏపీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్‌కు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Telugu Film Chamber of Commerce) లేఖ రాసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో తెలుగుతోపాటు తమిళ అగ్ర హీరోల సినిమాలు విడుదలకానున్న నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్.. అసోసియేషన్‌కు సూచించింది. ఈ విషయమై 2017లో తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేసింది. సంక్రాంతి, దసరాకు తెలుగు చిత్రాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఏపీ, తెలంగాణలోని ఎగ్జిబిటర్లకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే.
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న ‘వీర సింహారెడ్డి’ 2023 సంక్రాంతి బరిలో నిలవనున్నాయి. వీటితోపాటు తమిళ చిత్రాలు ‘వారిసు’ (విజయ్), ‘తునివు’ (అజిత్) విడుదలకు సిద్ధమవుతున్నాయి. ‘వారిసు’ (తెలుగులో వారసుడు), ‘వీర సింహారెడ్డి’ జనవరి 12న రిలీజ్ కానున్నాయి. ఇతర చిత్రాల విడుదల తేదీ ఖరారు కాలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.