
Gamanam: ఓటీటీలో గమనం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఇంటర్నెట్ డెస్క్: శ్రియ, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో సుజనా రావు తెరకెక్కించిన చిత్రం ‘గమనం’. వాస్తవిక సంఘటనల ఆధారంగా.. భావోద్వేగభరితమైన మూడు కథలతో రూపొందించారు. గతేడాది డిసెంబర్ 10న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. జనవరి 28 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో శ్రియ దివ్యాంగురాలి పాత్రలో నటించగా.. నిత్యా మేనన్ అతిథి పాత్రలో కనిపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందించగా.. జ్ఞానశేఖర్ వి.ఎస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించారు. రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞానశేఖర్ వి.ఎస్ సంయుక్తంగా నిర్మించారు. పాన్ ఇండియాగా రూపొందించిన ఈ చిత్రాన్ని తొలుత తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.. త్వరలో హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది.
ఇవీ చదవండి
Advertisement