Gurthunda Seethakalam: ఓటీటీలో ‘గుర్తుందా శీతాకాలం’ వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Gurthunda seethakalam ott: సత్యదేవ్‌, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.

Published : 20 Jan 2023 16:48 IST

Gurthunda seethakalam ott; హైదరాబాద్‌: సత్యదేవ్‌ (Satyadev), తమన్నా (Tamannaah) కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘గుర్తుందా శీతాకాలం’. నాగేశ్వర్‌ దర్శకుడు. ఎన్నో వాయిదాల అనంతరం గత డిసెంబరు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ప్రేక్షకులను ఆశించిన మేర అలరించలేదు. తాజాగా ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథేంటంటే: దేవ్‌ అలియాస్‌ సత్యదేవ్‌ (సత్యదేవ్‌) మధ్యతరగతి కుర్రాడు. స్కూల్‌ డేస్‌లోనే తొలిసారి ప్రేమలో విఫలమైన తను.. కాలేజీలో అమ్ము అలియాస్‌ అమృత (కావ్య శెట్టి)ని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె బాగా డబ్బున్న అమ్మాయి. దేవ్‌లోని అమాయకత్వం నచ్చి ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అమ్ముని పెళ్లి చేసుకొని త్వరగా జీవితంలో స్థిరపడాలన్న లక్ష్యంతో సత్య బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే అతనికి వచ్చే అరకొర సంపాదనతో బతకడం కష్టమని తల్లి చెప్పడంతో అమ్ము ఆలోచనలో పడుతుంది. దేవ్‌ను అవమానించి.. అతనికి బ్రేకప్‌ చెబుతుంది. ఆ బాధ నుంచి దేవ్‌ కోలుకునే లోపే.. అతని జీవితంలోకి నిధి (తమన్నా) ప్రవేశిస్తుంది. అతని గతం తెలిసీ తనని నిజాయితీగా ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో అమ్ము మళ్లీ దేవ్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? నిధిని పెళ్లి చేసుకున్నాక.. దేవ్‌ జీవితం ఎలా సాగింది? (Gurthunda Seethakalam review) తన ప్రయాణంలో పరిచయమైన దివ్య (మేఘా ఆకాష్‌)కు అతను తన ప్రేమకథను ఎందుకు చెప్పాడు? ఈ కథలో ప్రశాంత్‌ (ప్రియదర్శి) పాత్రేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. పూర్తి రివ్యూ కోసం క్లిక్‌చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని