HIT 2 ott release: ఓటీటీలో అడివి శేష్‌ ‘హిట్‌2’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

HIT 2 ott release: అడివి శేష్‌, మీనాక్షి చౌదరి కీలక పాత్రల్లో నటించిన ‘హిట్‌2’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది

Updated : 04 Jan 2023 14:43 IST

హైదరాబాద్‌: అడివి శేష్‌ (Adivi Sesh) కీలక పాత్రలో శైలేష్‌ కొలను తెరకెక్కించిన క్రైమ్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ‘హిట్‌2’. గతంలో వచ్చిన ‘హిట్‌’ చిత్రానికి ఫ్రాంఛైజీగా దీన్ని తెరకెక్కించారు. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హిట్‌2’ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (Amazon prime video) మంగళవారం తీపి కబురు చెప్పింది. అద్దె ప్రాతిపదికన (రూ. 129 చెల్లించి చూసే విధంగా) ‘హిట్‌2’ను స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్‌ అవడంలేదు. జనవరి 6 నుంచి  చిత్రం అందుబాటులో ఉండనుంది. అయితే, అది రెంట్‌ కట్టి చేసే విధంగానా, ఉచితంగానా అనే విషయం తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

క‌థేమిటంటే: కృష్ణ‌దేవ్ అలియాస్ కేడీ (అడివి శేష్ ) ఓ యువ ఐపీఎస్ అధికారి.  విశాఖ‌ప‌ట్నం ఎస్పీగా విధుల్లో చేర‌తాడు.  క్రిమిన‌ల్స్‌వి కోడి బుర్ర‌లనీ, వాళ్ల‌ని ప‌ట్టుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాద‌ని తేలిగ్గా తీసిపారేస్తుంటాడు.  ఆర్య (మీనాక్షి చౌద‌రి)ని ప్రేమించిన కేడీ ఆమెతో క‌లిసి  జీవితాన్ని ఆరంభిస్తాడు. ఇంత‌లో  విశాఖ‌లోని ఓ ప‌బ్‌లో ఓ అమ్మాయి దారుణ హ‌త్య‌కి గుర‌వుతుంది. చేతులు, కాళ్లూ, మొండెం అన్నీ వేరు చేసి.. దారుణ స్థితిలో ఉన్న ఆ అమ్మాయి మృత‌దేహాన్ని చూసిన కేడీకి.. ప‌రిశోధ‌న‌లో మ‌రో విస్తుపోయే నిజం తెలుస్తుంది. ఆ కాళ్లూ చేతులు, మొండెం ఒక‌రివి కాద‌ని.. మొత్తం న‌లుగురు అమ్మాయిలు హ‌త్య‌కి గుర‌య్యార‌నేది ఆ నిజం.  అమ్మాయి మెడపై ఉన్న పంటిగాటు త‌ప్ప మ‌రే ఆధారం లేకుండా హ‌త్య‌లు చేస్తున్న ఆ కిల్ల‌ర్ ఎవ‌రు?  అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేశాడు?  కోడి బుర్ర‌ల‌ని తేలిగ్గా తీసిపారేసిన కేడీకి  కిల్ల‌ర్ ఎలాంటి స‌వాళ్లు విసిరాడ‌నేది తెర‌పై చూడాల్సిందే.

పూర్తిరివ్యూ: అడివి శేష్‌ కీలక పాత్రలో నటించిన ‘హిట్‌2’ సినిమా ఎలా ఉందంటే?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని