Meter ott release date: ఓటీటీలో ‘మీటర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
meter,meter ott release date: కిరణ్ అబ్బవరం, అతుల్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మీటర్’ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది.
హైదరాబాద్: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న కథానాయకుడు కిరణ్ అబ్బవరం (kiran abbavaram). ఆయన కథానాయకుడిగా రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’ (Meter,meter ott release date). అతుల్య కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజాయన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ వేదికగా మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కథేంటంటే: అర్జున్ కల్యాణ్ (కిరణ్ అబ్బవరం) తండ్రి నిజాయితీ గల కానిస్టేబుల్. వృత్తిపట్ల ఎంత నిబద్ధతగా ఉన్నా అవినీతిపరులైన ఉన్నతాధికారుల కారణంగా తన కెరీర్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. పైగా తన నిజాయితీ వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. అందుకే తన కొడుకును ఎస్సైను చేసి పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకురావాలని కలలుకంటాడు. కానీ, అర్జున్‌కు పోలీస్ అవ్వడం అసలు ఇష్టం ఉండదు. అయితే తండ్రి ఇష్టాన్ని కాదనలేక పోలీస్ సెలక్షన్స్‌కు హాజరై.. ఏదోరకంగా అందులో ఫెయిలవుతూ వస్తుంటాడు. కానీ, ఓసారి అనుకోకుండా ఆ సెలక్షన్స్ పాసై ఎస్సై అయిపోతాడు. దీంతో ఆ పోలీస్ ఉద్యోగం నుంచి బయటకు రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే హోంమంత్రి కంఠం బైర్రెడ్డి (పవన్) వల్ల అర్జున్ జీవితం అనుకోని మలుపు తిరుగుతుంది. మరి అదేంటి? బైర్రెడ్డి వల్ల అతనెలాంటి సమస్యల్లో చిక్కుకున్నాడు?(Meter movie review) ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చేందుకు బైర్రెడ్డి చేసిన కుంభకోణం ఏంటి? దాని వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థ ఎలా ప్రభావితమైంది? దాన్ని అర్జున్ ఎలా చేధించాడు? అన్నది మిగతా కథ.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rakul Preet Singh: అదొక కీలక నిర్ణయం.. ఎన్నో తిరస్కరణలు ఎదుర్కొన్నా: రకుల్ ప్రీత్ సింగ్
-
Bomb blast: బలూచిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 34 మంది మృతి
-
Jet Airways: జెట్ ఎయిర్వేస్లో కీలక పరిణామం.. వచ్చే ఏడాది నుంచి రెక్కలు
-
Madhya Pradesh rape: వైరల్ వీడియో చూసి, నా బిడ్డను గుర్తించా: బాలిక తండ్రి ఆవేదన
-
Apple Devices: ఐఓఎస్ యూజర్లకు కేంద్రం సూచన.. అప్డేట్ విడుదల చేసిన యాపిల్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు