అలాంటి అనుమతులు ఇక్కడా ఇవ్వండి

తెలుగు రాష్ట్రాల్లోని సినీ ధియేటర్,మల్టీప్లెక్సుల్లో 100 శాతం సీట్ల ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని సీనీ నిర్మాతలు కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం తెలుగు సినీ నిర్మాతల మండలి తరుఫును రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినతిపత్రం అందజేశారు.

Published : 06 Jan 2021 01:29 IST

తెలుగు సినీ నిర్మాతల మండలి 

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లోని సినీ ధియేటర్,మల్టీప్లెక్సుల్లో 100 శాతం సీట్ల ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వాలని సినీ నిర్మాతలు కోరుతున్నారు. ఈ మేరకు మంగళవారం తెలుగు సినీ నిర్మాతల మండలి తరఫున రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు వినతిపత్రం అందజేశారు. సోమవారం తమిళనాడు ప్రభుత్వం అక్కడి సినీ ధియేటర్లలో 100 శాతం సీట్లు నింపుకునేలా అనుమతులు ఇచ్చింది. కరోనా తర్వాత కాస్త పరిస్థితులు చక్కబడటం, సంక్రాంతి పండుగకు భారీ బడ్జెట్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అదే మాదిరిగా ఏపీ, తెలంగాణలోని ధియేటర్లు 100 శాతం సీట్ల ఆక్యుపెన్సీకి రెండు ప్రభుత్వాలు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే లాక్‌డౌన్‌తో భారీమొత్తంలో ఆదాయం కోల్పోయామని, తిరిగి గాడిలో పడాలంటే ప్రభుత్వాలు సహాకారం అందించాలని వారు కోరారు.  ఈ మేరకు ఒక ప్రెస్‌నోట్‌ విడుదల చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో మండలి ప్రెసిడెంట్‌ సి.కల్యాణ్‌, ఉపాధ్యక్షులు అశోక్‌ కుమార్‌, వైవీఎస్‌ చౌదరీతో పాటు ఇతర సభ్యులు ఉన్నారు.

ఇవీ చదవండి!

‘కిసాన్‌ పరేడ్‌’ కోసం ట్రాక్టర్‌ ఎక్కిన మహిళలు

తొమ్మిది హత్యలు.. ఆరు ఎదురుకాల్పులు

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts