The Ghost: ఓటీటీలో నాగార్జున ‘ది ఘోస్ట్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

నాగార్జున కథానాయకుడిగా నటించిన ‘ది ఘోస్ట్‌’ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమవుతోంది.

Updated : 21 Oct 2022 18:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగార్జున (Nagarjuna) కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది ఘోస్ట్‌’. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యాక్షన్‌ మూవీ లవర్స్‌ మాత్రమే ఆకట్టుకోగలిగింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నవంబరు 2వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘ది ఘోస్ట్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. గతంలోనూ నాగార్జున నటించిన ‘వైల్డ్‌డాగ్‌’ థియేటర్‌లో అంతగా మెప్పించలేదు. అయితే, ఓటీటీలో మాత్రం ఆ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. అత్యధిక రేటింగ్స్‌ను సొంతం చేసుకుంది. మరి ఇప్పుడు ‘ది ఘోస్ట్‌’ ఓటీటీలో ఎలా అలరిస్తుందో చూడాలి.

క‌థేంటంటే: విక్ర‌మ్ (నాగార్జున) ఇంట‌ర్‌పోల్ అధికారి.  ప్రియ (సోనాల్‌చౌహాన్‌)తో క‌లిసి దుబాయ్‌లో ప‌నిచేస్తుంటాడు. ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉంటారు.  ఒక ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌నలో రౌడీ మూక చేతుల్లో చిన్న పిల్లాడు చ‌నిపోతాడు. అది విక్రమ్‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది.  మాన‌సికంగా కుంగిపోతాడు.  ఆ త‌ర్వాత ప్రియ అత‌న్నుంచి దూరం అవుతుంది.  ఇంత‌లో ఉన్న‌ట్టుండి అను (గుల్‌ప‌నాగ్‌) నుంచి విక్ర‌మ్‌కి ఫోన్ వ‌స్తుంది. త‌న‌నీ, త‌న కూతురు అదితి (అనైకా సురేంద్ర‌న్‌)ని కాపాడ‌మని అను కోరుతుంది. దాంతో ఊటీకి బ‌య‌ల్దేరతాడు విక్ర‌మ్‌. ఆ క్ర‌మంలో అత‌నికి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? (The Ghost Review) ఇంత‌కీ అను ఎవ‌రు? ఆమెకీ, విక్ర‌మ్‌కీ సంబంధ‌మేమిటి?  ఆమెకి ఎవ‌రి నుంచి ముప్పు పొంచి ఉంది?  మ‌రి ఆమె కుటుంబాన్ని విక్ర‌మ్ ఎలా కాపాడాడ‌నేది తెర‌పై చూసి తెలుసుకోవాల్సిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని