OoAntava OoOoAntava: ‘ఊ అంటావా ఊఊ అంటావా’ మేల్‌ వెర్షన్‌ అదుర్స్‌..!

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’లో అగ్రకథానాయిక సమంత ఓ స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడిన విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం...

Updated : 07 Dec 2022 15:09 IST

చిరు, పవన్‌, స్టెప్పులు పర్‌ఫెక్ట్ ఫిట్‌.. వీడియో వైరల్‌

హైదరాబాద్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’లో అగ్రకథానాయిక సమంత ఓ స్పెషల్‌ సాంగ్‌లో ఆడిపాడిన విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో సుమారు 34 మిలియన్ల వ్యూస్‌తో అగ్రస్థానంలో ట్రెండ్‌ అవుతోంది. ఇప్పుడు ఇదే పాటకు మేల్‌ వెర్షన్‌ బయటకు వచ్చింది. ఒరిజినల్‌ వెర్షన్‌లో ఉన్న లిరిక్స్‌నే తీసుకొని.. ‘‘మీ కళ్లల్లోనే వంకర ఉంది. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా పాప ఊఊ అంటావా’’ అంటూ మార్చి పాడి..  ‘‘వాలి’’ అనే ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఆ పాటకు తగినట్టు ‘తమ్ముడు’, ‘అత్తారింటికి దారేది’, ‘బిల్లా’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ‘వేదం’, ‘ఖైదీ నం: 150’ చిత్రాల్లోని పలు ఫేమస్‌ స్టెప్పులతో ఈ క్లిప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ‘మేల్‌ వెర్షన్‌ అదిరింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు సుకుమార్‌ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ చిత్రం డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. బన్నీకి జంటగా రష్మిక సందడి చేయనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని