Telugu Movies: ఈ ఏప్రిల్‌లో ప్రతివారం థియేటర్‌లో సందడే సందడి
telugu Movies in april: ఈ నెలలో వరుసగా తెలుగు సినిమాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. ప్రతి వారం ఒక భారీ బడ్జెట్ సినిమా విడుదల కాబోతోంది.
ఒకవైపు చాలా తరగతుల పరీక్షలు ముగింపునకు వచ్చాయి. మరోవైపు వేసవి సందడి కూడా మొదలైంది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. మండుటెండలో ఏసీ థియేటర్‌లో కూర్చొని సినిమా చూస్తే, వచ్చే మజానే వేరు. అందుకు అంతా రెడీ అంటోంది టాలీవుడ్. ఏప్రిల్ నెలలో వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద అలరించనున్నాయి. మరి ఎవరెవరు ఈ వేసవికి అలరిస్తారు? వారి సినిమాలేంటి?
సైకలాజికల్ థ్రిల్లర్‌తో రవితేజ
చిత్రం: రావణాసుర; నటీనటులు: రవితేజ, సుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, దక్షా నగర్కర్; సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరిలియో; దర్శకత్వం: సుధీర్ వర్మ; విడుదల: 07-04-2023
మీటర్ కథేంటి?
చిత్రం: మీటర్; నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణ మురళి; సంగీతం: సాయి కార్తీక్; దర్శకత్వం: రమేశ్ కాడూరి; విడుదల తేదీ: 07-04-2023
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది?
చిత్రం: 1947 ఆగస్టు 16; నటీనటులు: గౌతమ్ కార్తిక్, పుజా, రేవతి, రిచర్డ్ ఆస్టన్, జాన్ షా తదితరులు; సంగీతం: సీన్ రోల్డన్; దర్శకత్వం: ఎన్‌ఎస్ పొన్ కుమార్; విడుదల తేదీ :07-04-2023
పౌరాణిక కథతో సమంత
చిత్రం: శాకుంతలం; నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్‌బాబు తదితరులు; సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: గుణ శేఖర్; విడుదల తేదీ: 14-04-2023
లారెన్స్ నుంచి యాక్షన్ థ్రిల్లర్
చిత్రం: రుద్రుడు; నటీనటులు: లారెన్స్, ప్రియా భవానీ శంకర్, శ్యామ్ ప్రసాద్; సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; దర్శకత్వం: కదిరేశన్; విడుదల తేదీ: 14-04-2023
మిస్టరీ థ్రిల్లర్‌తో వస్తున్న సాయిధరమ్‌తేజ్
చిత్రం: విరూపాక్ష; నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మేనన్; సంగీతం: అజనీష్ లోకనాథ్; దర్శకత్వం: కార్తిక్ దండు; విడుదల తేదీ: 21-04-2023
స్టూడెంట్ కథేంటి?
చిత్రం: నేను స్టూడెంట్ సర్; నటీనటులు: బెల్లకొండ గణేష్, అవంతిక, సముద్రఖని, సునీల్ తదితరులు; సంగీతం: మహతి స్వర సాగర్; దర్శకత్వం: రాఖీ ఉప్పలపాటి; విడుదల తేదీ: 21-04-2023
ఒకే పాత్రతో ప్రయోగం
చిత్రం: హలో మీరా; నటీనటులు: గార్గేయి యల్లాప్రగడ; సంగీతం: చిన్నా; దర్శకత్వం: శ్రీనివాసు కాకర్ల; విడుదల తేదీ: 21-04-2023
అన్ని ప్రశ్నలకు సమాధానం లభిస్తుందా?
చిత్రం: పొన్నియిన్ సెల్వన్2; నటీనటులు: విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, ప్రభు, శరత్ కుమార్; సంగీతం: ఏఆర్ రెహమాన్; దర్శకత్వం: మణిరత్నం; విడుదల తేదీ: 28-04-2023
స్పై థ్రిల్లర్ కథతో అఖిల్
చిత్రం: ఏజెంట్; నటీనటులు: అఖిల్, మమ్ముటి, డైనో మోరియా, విక్రమ్‌జీత్; సంగీతం: హిప్‌హాప్ తమిళ; దర్శకత్వం: సురేందర్‌రెడ్డి; విడుదల తేదీ: 28-04-2023
వీటితో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ఈ వారం సందడి చేయనున్నాయి. ఇక ఓటీటీలో వచ్చే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఈ వినోదానికి అదనం. అంటే ఈ ఏప్రిల్ మండుటెండలో వినోదాల చిరుజల్లులు కురిపించనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పునరుద్ధరించిన పట్టాలపై గూడ్స్ రైలు.. ఊపిరి పీల్చుకున్న రైల్వే మంత్రి..!
-
General News
TS High Court: భారాస ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు.. రద్దు చేసిన హైకోర్టు
-
World News
USA: విమానాన్ని వెంబడించిన ఫైటర్ జెట్.. సానిక్ బూమ్‌తో హడలిన వాషింగ్టన్
-
India News
Odisha: ఒడిశాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
Sports News
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఓవల్ మైదానంలో టీమ్ఇండియా రికార్డులు ఇలా..
-
Movies News
RRR: ‘ఆర్ఆర్ఆర్’కు ఫిదా అయిన స్పైడర్ మ్యాన్.. అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు