Hansika: ఒకే పాత్ర.. ఒకే షాట్‌

కథానాయిక హన్సిక ఏక పాత్రాభినయం చేసిన చిత్రం ‘105 మినిట్స్‌’. రాజు దుస్సా దర్శకుడు. బొమ్మక్‌ శివ నిర్మించారు. ఉత్కంఠభరితంగా సాగే కథతో సింగిల్‌ షాట్‌ విధానంలో తెరకెక్కించారు. ఈ చిత్ర వీడియో గ్లింప్స్‌ను ప్రముఖ   ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్‌ కుమార్‌ ఇటీవల విడుదల చేశారు.

Updated : 06 Nov 2021 13:51 IST

కథానాయిక హన్సిక ఏక పాత్రాభినయం చేసిన చిత్రం ‘105 మినిట్స్‌’. రాజు దుస్సా దర్శకుడు. బొమ్మక్‌ శివ నిర్మించారు. ఉత్కంఠభరితంగా సాగే కథతో సింగిల్‌ షాట్‌ విధానంలో తెరకెక్కించారు. ఈ చిత్ర వీడియో గ్లింప్స్‌ను ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్‌ కుమార్‌ ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘హాలీవుడ్‌లో ప్రయత్నించిన సింగిల్‌ షాట్‌ చిత్రీకరణకు నేను పెద్ద అభిమానిని. అలా మనవాళ్లెవరూ చేయట్లేదు అనుకున్న సమయంలో.. ‘105 మినిట్స్‌’ రూపంలో రాజు దాన్ని చేసి చూపారు. కథ, కథనం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించాయి. ఇలాంటి సవాల్‌తో నిండిన సినిమా చేయడానికి నిర్మాతకు చాలా ధైర్యం ఉండాలి’’ అన్నారు. ‘‘చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర బృందం తెలియజేసింది. ఈ సినిమాకి సంగీతం: సామ్‌ సి.యస్‌, ఛాయాగ్రహణం: కిషోర్‌ బొయిదాపు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని